Hair: ఎందుకూ పనికిరావని దానిమ్మ తొక్కలను పారేస్తున్నారా..? వాటిని ఇలా కూడా వాడొచ్చండోయ్.. నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే..!

ABN , First Publish Date - 2023-05-30T18:27:40+05:30 IST

తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఈ దానిమ్మ తొక్కలు గొప్ప వరమండీ బాబూ.. బయట కొనే రసాయన ఆధారిత హెయిర్ డైలతో పనిలేకుండా జుట్టును నల్లగా తుమ్మెద రెక్కల్లా మార్చుకోవడానికి ఇంట్లోనే ఈజీగా ఇలా..

Hair: ఎందుకూ పనికిరావని దానిమ్మ తొక్కలను పారేస్తున్నారా..? వాటిని ఇలా కూడా వాడొచ్చండోయ్.. నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే..!

దానిమ్మ పండు అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. చక్కని ఆరోగ్యం చేకూర్చడంలో దానిమ్మ చాలా బాగా సహాయపడుతుంది. ఇక మధుమేహ రోగులకు, రక్తహీనత ఉన్నవారికి ఈ దానిమ్మ గొప్ప వరమనే చెప్పవచ్చు. అయితే తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఈ దానిమ్మ తొక్కలు గొప్ప వరమండీ బాబూ.. బయట కొనే రసాయన ఆధారిత హెయిర్ డైలతో(chemical hair dye) పనిలేకుండా జుట్టును నల్లగా తుమ్మెద రెక్కల్లా మార్చుకోవడానికి ఇంట్లోనే ఈజీగా హెయిర్ డై తయారుచేసుకోవచ్చు. ఇందులో దానిమ్మ తొక్కలనే కాకుండా మరికొన్ని పదార్థాలు వాడి హెయిర్ డై తయారు చేయవచ్చు. దీనికి కావలసిన పూర్తీ పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే..

కృత్రిమ హెయిర్ డై లు జుట్టుకు నలుపు రంగును ఇచ్చినా మెదడు కణాలకు నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా మతిమరుపు, మైగ్రేన్, మెదడుకు సంబంధించిన ఇతర రుగ్మతలు వస్తాయి. ఇంట్లోనే నాచురల్ గా హెయిర్ డై(Natural hair dye) చేసుకుని వాడటం ఆరోగ్యం. ఇందుకోసం కావాల్సినవి..

దానిమ్మ తొక్కలు(pomegranate peels)- ఒక కప్పు

బ్రూ కాఫీ పౌడర్(bru coffee powder) - ఒక స్పూన్

ఇండిగో పౌడర్(Indigo powder) - అరస్పూన్

ఉసిరికాయ పొడి(gooseberry powder) - ఒక స్పూన్

హెన్నా పౌడర్(henna powder) - 5 టేబుల్ స్పూన్లు

Viral News: అయ్యయ్యో.. ఇదేం విచిత్రం.. ఓ పక్షిని కాపాడబోయి.. రూ.లక్ష నష్టపోయిన యువతి..!


తయారీ విధానం..

స్టవ్ మీద ఇనుప మూకుడు(iron kadai) పెట్టి రెండు కప్పుల నీళ్ళు మూకుడులో పోయాలి. ఇందులోకి హెన్నా పొడర్ తప్ప అన్ని పదార్థాలు వేసి సన్నని మంట మీద బాగా ఉడికించాలి. రెండు కప్పుల నీళ్ళు కాస్తా ఒక కప్పుకు వచ్చిన తరువాత(సుమారు 15నిమిషాలు ఉడికిన తరువాత) స్టవ్ ఆఫ్ చేసి ఉడికిన మిశ్రమం చల్లబడనివ్వాలి. చల్లగా అయిన తరువాత దీన్ని స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి. వడగట్టగా వచ్చిన మిశ్రమంలో 5టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో తయారుచేసుకుని రాత్రంతా ఇనుప మూకుడులో అలాగే ఉంచాలి. ఉదయానికల్లా చిక్కని నలుపుతో ఇంట్లోనే మంచి హెయిర్ డై తయారైపోయినట్టే. దీన్ని జుట్టు కుదుళ్ళకు, వెంట్రుకలు పొడవునా పట్టించాలి. సుమారు రెండు గంటలపాటు ఉంచి ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తే జుట్టు తుమ్మెద రెక్కల్లా నల్లగా మెరిసిపోతుంది.

Viral News: సోషల్ మీడియాలో చూసి ఒక్కసారి ట్రై చేసింది.. చివరకు ముఖం ఇలా తయారయింది.. ఈ మహిళ అసలేం చేసిందంటే..!


Updated Date - 2023-05-30T18:27:40+05:30 IST