Longest Prison Sentence: ఈ మహిళకు 1,41,078 ఏళ్ల జైలు శిక్ష.. అంత పెద్ద నేరం ఏం చేసిందంటే?

ABN , First Publish Date - 2023-08-02T21:11:31+05:30 IST

మోసాలకు పాల్పడే వ్యక్తులకు ఎంతకాలం శిక్ష విధిస్తారు? ఆయా దేశాల చట్టాల ప్రకారం.. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు విక్ష విధించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో ఈ శిక్ష అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అంతే తప్ప.. పదుల సంఖ్యలో శిక్షలు పడిన దాఖలాలు లేవు. కానీ..

Longest Prison Sentence: ఈ మహిళకు 1,41,078 ఏళ్ల జైలు శిక్ష.. అంత పెద్ద నేరం ఏం చేసిందంటే?

మోసాలకు పాల్పడే వ్యక్తులకు ఎంతకాలం శిక్ష విధిస్తారు? ఆయా దేశాల చట్టాల ప్రకారం.. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు విక్ష విధించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో ఈ శిక్ష అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అంతే తప్ప.. పదుల సంఖ్యలో శిక్షలు పడిన దాఖలాలు లేవు. కానీ.. ఒక మహిళ విషయంలో కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆమెకు ఏకంగా 1,41,078 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతకీ, ఆమె అంత పెద్ద నేరం ఏం చేసిందనేగా మీ సందేహం! తన ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని, అధిక రాబడి పేరుతో ఏకంగా 16వేల మందిని మోసం చేసింది.


ఆ నిందితురాలి పేరు చమోయ్ తిప్యాసో. థాయ్‌లాండ్‌కు చెందిన ఈమె.. పెట్రోలియం అథారిటీలో ఒక ఉద్యోగి. ఇప్పుడు ఈ కంపెనీని PTT అని పిలుస్తారు. ఈజీ మనీకి అలవాటు పడిన తిప్యాసో.. జనాలను దోచుకోవాలన్న ఉద్దేశంతో ఒక పొదుపు పథకాన్ని (చిట్ ఫండ్స్) ప్రవేశపెట్టింది. ఫైనాన్స్ కంపెనీ, పెట్టుబడి పథకం నడపడం మొదలుపెట్టింది. ‘రాయల్ థాయ్ ఎయిర్‌ఫోర్స్‌’లో తనకున్న కనెక్షన్లను ఉపయోగించి, తాను చేసిన భారీ స్కామ్‌ను చట్టబద్ధంగా చూపించింది. తమ కంపెనీలో పెట్టే పెట్టుబడికి తాము ఒక బాండ్ ఇస్తామని, కొంత సమయం తర్వాత నుంచి అధిక రాబడి రావడం మొదలవుతుందని ఆమె నమ్మించింది. కాగితాలపై ప్రభుత్వ సంస్థ పేరుతో పాటు పెద్ద వ్యక్తుల పేర్లు కూడా ఉండటం చూసి.. ఈ పొదుపు పథకం నిజమేనని నమ్మి, జనాలు ఆమె కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.


అయితే.. ఈ చిట్ ఫండ్స్ పేరుతో తిప్యాసో భారీ మోసాలకు పాల్పడుతోందని 1980వ దశకంలో తేలింది. ఈ స్కామ్ బయటపడినప్పుడు, ‘చిట్ ఫండ్’ కంపెనీ మూసివేయబడింది. సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం.. 1989లో తిప్యాసో 16000 మందిని మోసం చేసి, వారి వద్ద నుంచి 16 బిలియన్ రూపాయల్ని కొల్లగొట్టిందని కోర్టు నిర్ధారించింది. ఇంత పెద్ద మోసానికి పాల్పడినందుకు గాను.. కోర్టు ఆమెకు 1,41,078 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో.. ప్రపంచంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన శిక్షగా నిలిచిందిపోయింది. కానీ.. తనకున్న భారీ పలుకుబడితో, కొన్నాళ్లలోనే జైలు నుంచి విడుదల అయ్యింది. ఆ తర్వాత.. మోసాలకు పాల్పడే వారిని గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించాలన్న కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

Updated Date - 2023-08-02T21:15:10+05:30 IST