Shocking Video: నల్ల పులిని చూశారా? ఒడిశా అడవుల్లో అరుదైన పులులు.. వీడియో వైరల్!
ABN , Publish Date - Dec 24 , 2023 | 08:27 PM
సాధారణంగా పెద్ద పులి అనగానే మన కళ్ల ముందు ఓ రూపం మెదలుతుంది. పసుపు, నలుపు రంగుల చారలతో ఓ గంభీరమైన రూపం కదలాడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలోని పులి నల్లగా ఉంది.
సాధారణంగా పెద్ద పులి (Tiger) అనగానే మన కళ్ల ముందు ఓ రూపం మెదలుతుంది. పసుపు, నలుపు రంగుల చారలతో ఓ గంభీరమైన రూపం కదలాడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలోని పులి నల్లగా (Black Tiger) ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Tiger Video).
``భారతదేశంలో నల్ల పులులు`` అంటూ పర్వీన్ ఈ వీడియోను పంచుకున్నారు. ఒడిశా (Odisha)లోని సిమిలిపాల్ అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డు అయింది. సిమిలిపాల్‌లో నల్ల రంగులో కనిపించే ఈ పులులు ``సూడో మెలానిస్టిక్ పులులు``. జన్యు పరివర్తన కారణంగా ఆ పులులు అలా ఉంటాయి. అవి చాలా అరుదైనవని, అందమైనవని పర్వీన్ పేర్కొన్నారు. కాగా, భారత్‌లో తొలిసారి 1993 జూలై 21న నల్లపులిని కనుగొన్నారు.
పొడగడ్ గ్రామానికి చెందిన సల్కు అనే యువకుడు ఆత్మరక్షణ కోసం బాణాలతో ఒక నల్ల పులిని చంపాడు. అరుదైన జన్యు పరివర్తన కారణంగా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. రంగు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ పెద్ద పులుల తరహాలోనే ఉంటాయి. కాగా, పర్వీన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.