Wife: పాపం.. ఆ భర్త ఎంత అమాయకుడు.. భార్యను కష్టపడి చదివించాడు.. గవర్నమెంట్ జాబ్ సంపాదించిన ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-08-22T15:52:49+05:30 IST

ఆ యువకుడు ఫ్యాక్టరలో పని చేసుకుంటూ భార్యను చదివించాడు.. తను అప్పటివరకు సంపాదించిన డబ్బులతో పాటు పొలం కూడా అమ్మి మొత్తం ఆమె చదువుకే ఖర్చు పెట్టాడు.. భార్యకు ఉద్యోగం వస్తే తమ కష్టాలు తీరిపోతాయనుకున్నాడు.. అనుకున్నట్టుగానే అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది.. అయితే..

Wife: పాపం.. ఆ భర్త ఎంత అమాయకుడు.. భార్యను కష్టపడి చదివించాడు.. గవర్నమెంట్ జాబ్ సంపాదించిన ఆమె ఏం చేసిందంటే..

ఆ వ్యక్తి ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ భార్యను చదివించాడు.. తను అప్పటివరకు సంపాదించిన డబ్బులతో పాటు పొలం కూడా అమ్మి మొత్తం ఆమె చదువుకే ఖర్చు పెట్టాడు.. భార్యకు ఉద్యోగం వస్తే తమ కష్టాలు తీరిపోతాయనుకున్నాడు.. అనుకున్నట్టుగానే అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది.. అయితే అమాయక భర్త వదిలించుకునే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది.. భర్తకు విడాకులిచ్చి అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.. భార్య చేతిలో దారుణంగా మోసపోయిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు (Wife Cheated Husband).

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని జబల్పూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రామ్‌జీ పటేల్‌కి సింగూలి గ్రామానికి చెందిన రోష్ని పటేల్‌తో వివాహం (Marriage) జరిగింది. వివాహం జరిగే నాటికి రోష్ని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుపై ఆసక్తి కలిగిన భార్యను పై చదువులు చదివించాలని రామ్‌జీ నిర్ణయించుకున్నాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బంతా ఆమె చదువు కోసమే ఖర్చు పెట్టాడు. అలా ఆమెను ఎంఏ వరకు చదివించాడు. అనంతరం డబ్బులు అప్పు చేసి ఆమెను కోచింగ్‌కు కూడా పంపించాడు. ఆ తర్వాత రోష్నికి ప్రాథమిక పాఠశాలలో టీచర్ ఉద్యోగం వచ్చింది.

Viral: నా ప్రేమికుడు మోసం చేశాడు.. 63 ఏళ్ల వృద్ధురాలు ఇచ్చిన కంప్లైంట్ విని అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ఉద్యోగం వచ్చిన తర్వాత రోష్ని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. తనతో పాటు పని చేసే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాదు అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్తకు విడాకుల నోటీసు పంపించింది. భార్య చేతిలో దారుణంగా మోసోపోయిన రామ్‌జీ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చేసిన మోసం గురించి వివరించాడు. అయితే పోలీసులు రోష్నీపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. దీంతో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాడు.

Updated Date - 2023-08-22T15:52:49+05:30 IST