Head Bath: వారంలో ఎన్నిసార్లు తలస్నానం చెయ్యాలి? ఎలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుందంటే..
ABN , First Publish Date - 2023-06-19T13:30:27+05:30 IST
ప్రతి రోజు స్నానం చేసి శరీరాన్నిశుభ్రపరుచుకున్నట్టు తల స్నానం ద్వారా జుట్టును శుభ్రపరుచుకోవడం కామన్. కొందరు తల స్నానం ప్రతిరోజు చేస్తారు. మరికొందరు వారానికి ఒకసారి, ఇంకొందరు వారంలో రెండు నుండి మూడుసార్లు తలస్నానం చేస్తుంటారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తల స్నానం వారంలో ఎన్నిసార్లు చెయ్యాలి? తల స్నానానికి, జుట్టు పెరగడానికి ఉన్న లింకేంటి ?
ప్రతి రోజు స్నానం చేసి శరీరాన్నిశుభ్రపరుచుకున్నట్టు తల స్నానం ద్వారా జుట్టును శుభ్రపరుచుకోవడం కామన్. కొందరు తల స్నానం ప్రతిరోజు చేస్తారు. మరికొందరు వారానికి ఒకసారి, ఇంకొందరు వారంలో రెండు నుండి మూడుసార్లు తలస్నానం చేస్తుంటారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తల స్నానం వారంలో ఎన్నిసార్లు చెయ్యాలి? తల స్నానానికి, జుట్టు పెరగడానికి ఉన్న లింకేంటి? తెలుసుకుంటే..
ప్రతిరోజూ తలస్నానం చేస్తే..(head bath every day)
ప్రతిరోజూ తలస్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. బయట ఎక్కువగా తిరిగేవారికి ట్రాఫిక్ కారణంగా దుమ్ము, ధూళి పట్టేసి జుట్టు తొందరగా మురికిగా మారుతుంది. అందుకే చాలామంది రోజూ తలస్నానం చేస్తుంటారు. అయితే ఇలా తలస్నానం చేయడం వల్ల జుట్టు బలహీనం అవుతుంది. షాంపూలు ఎక్కువ వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. ఈ కారణంగా జుట్టురాలిపోవడం, విరిగిపోవడం, తొందరగా తెల్లజుట్టు రావడమనే సమస్యలు ఎక్కువ అవుతాయి.
Corn Silk: మొక్కజొన్న తినే అందరూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. పనికిరాదని చెత్తబుట్టలోకి వేస్తుంటారు కానీ..
వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తే..(Head bath weekly one)
వారానికి ఒకసారి తల స్నానం చేసే అలవాటు కూడా జుట్టును దెబ్బతీస్తుంది. మురికి ఎక్కువగా పేరుకుపోయి జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. జుట్టు రఫ్ గా మారిపోతుంది. దీనివల్ల డాండ్రఫ్, సొరియాసిస్, పుండ్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏది సరైన పద్దతి?
వారంలో రెండు నుండి మూడు సార్లు తలస్నానం చెయ్యడం సరైన పద్దతి(2 to 3 times head bath is good). జుట్టులో దురద, డాండ్రఫ్ ఉన్నవారు, చెమట ఎక్కువగా పట్టేవారు ప్రతిరోజూ తలస్నానం చెయ్యవచ్చు. అయితే మైల్డ్ షాంపూలు ఉపయోగించాలి.
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు.. (mistakes while head bath)
తలస్నానం చేసేటప్పుడు అందరూ కామన్ గా చేసే మిస్టేక్ లు కొన్ని ఉన్నాయి. షాంపూ సల్ఫేట్ ఫ్రీనా(sulfate free shampoo) కాదా చూసుకోవాలి. సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూలు జుట్టును తేమగా ఉంచుతాయి. తలస్నానం చెయ్యడానికి చాలా వేడిగా ఉన్న నీరు అస్సలు వాడకూడదు(don't use hot water). జుట్టు చిట్లడం, విరిగిపోవడం, బలహీనం కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గోరువెచ్చగా ఉన్న నీరు తలస్నానానికి మంచింది. తలస్నానం చేశాక తడిజుట్టుకు టవల్ బదులు మెత్తగా ఉన్న టీ షర్ట్ ను(use t-shirt to tie wet hair) ఉపయోగించాలి. జుట్టుకు కండీషనర్(hair conditioner) ఉపయోగించడం వల్ల జుట్టు తేమ కోల్పోదు. పైపెచ్చు జుట్టు సిల్కీగా, స్మూత్ గా మారుతుంది.