Health Awareness: హెయిర్ ఫాల్స్‌కు అధిక పొట్టకొవ్వు ఒక కారణమా? వైద్యులు చెబుతున్నదేంటంటే..!
ABN , First Publish Date - 2023-05-10T14:04:59+05:30 IST
ఇండియాలో పొట్టకొవ్వు(Belly Fat ) సమస్య విపరీతంగా ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి(Unhealthy Lifestyle) దీనికి కారణమంటున్నారు నిపుణులు. దీంతో పాటు చాలామంది జుట్టురాలడం(Hair Loss) సమస్య
ఇండియాలో పొట్టకొవ్వు(Belly Fat ) సమస్య విపరీతంగా ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి(Unhealthy Lifestyle) దీనికి కారణమంటున్నారు నిపుణులు. దీంతో పాటు చాలామంది జుట్టురాలడం(Hair Loss) సమస్య కూడా ఎదుర్కొంటున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్, జుట్టు రాలడం మధ్య పరోక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్(Gastroenterologist) డాక్టర్ పళనియప్పన్ మాణికం జుట్టు రాలడం సమస్యకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఇన్సులిన్(Insulin) లాంటి గ్రోత్ ఫ్యాక్టర్(IGF-1) హార్మోన్ జుట్టు రాలడానికి కారణం కావచ్చని తెలిపాడు.
"ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ (IGF-1) హెయిర్ బల్బ్ మూలానికి రక్త ప్రవాహాన్ని పెంచే ఓ ముఖ్యమైన హార్మోన్. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుందన్నారు. ఈ హార్మోన్ ఇన్సులిన్ లాగా ప్రవర్తిస్తుందని ఇన్సులిన్ పని చేయనప్పుడు IGF కూడా పని చేయదు. తద్వారా జుట్టు పెరుగుదల తగ్గుతుంది" అని డాక్టర్ మాణికం చెప్పాడు.
సాధారణంగా పురుషులలో నడుము చుట్టుకొలత 90 సెం.మీ, స్త్రీలలో 80 సెం.మీ ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది పొట్ట కొవ్వుకు దారితీస్తుంది. పొట్ట కొవ్వు ఉన్న వ్యక్తుల్లో జుట్టు రాలడానికి 90 శాతం అవకాశం ఉందని తెలిపారు. పోషకాహారంతో పాటు, వారానికి 150 నిమిషాల వ్యాయామం ముఖ్యమని, ఇది మీ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేస్తుందని డాక్టర్ మాణికం సూచించారు.
శరీరంలో ప్యాంక్రియాస్ ద్వారా స్రవించే ఇన్సులిన్ ఒక ముఖ్యమైన హార్మోన్. మీ రక్తంలోని గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. కాలేయం, కొవ్వు, కండరాలలో గ్లూకోజ్ నిల్వ చేయడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల యొక్క శరీర జీవక్రియను నియంత్రిస్తుంది.
IGF అనేది రక్తంలో సహజంగా కనిపించే హార్మోన్. దీని ప్రధాన పని పెరుగుదల హార్మోన్ (GH) ప్రభావాలను నిర్వహించడం. ఇది కణజాలం, ఎముకల పెరుగుదల దీని నియంత్రణలో ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్ అభివృద్ధి సమయంలో సెల్యులార్ విస్తరణ, వలసలను నియంత్రించడం కూడా దీని పాత్ర.
న్యూ ఢిల్లీలోని ప్రైమస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్ డాక్టర్ నవ్య హండా కూడా దీనిని సమర్ధించారు. అధిక పొట్ట కొవ్వు ఉండటం అనారోగ్యకరమైన జీవనశైలికి సంకేతమని, ఇది జుట్టు రాలడానికి దోహదం చేస్తుందని నవ్య హండా అన్నారు.
"జుట్టు రాలడానికి ప్రధాన కారణం హార్మోన్లలో అసమతుల్యత. అధిక పొట్ట కొవ్వు డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అనే హార్మోన్ స్థాయికి దారి తీస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కుంచించుకుపోయి జుట్టు రాలిపోయేలా చేస్తుంది" అని డాక్టర్ నవ్య హండా చెప్పారు. అయితే అధిక పొట్ట కొవ్వు అనే నేరుగా జుట్టు రాలడానికి కారణం కాకపోయిన పరోక్షంగా ప్రభావం చూపుతుందన్నారు.
"అధిక స్థాయి ఒత్తిడి జుట్టు పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగిస్తుంది మరియు జుట్టు రాలడానికి దారితీస్తుంది. అందువల్ల, జుట్టు రాలడానికి బొడ్డు కొవ్వు నేరుగా కారణం కాకపోవచ్చు, ఇది జుట్టు రాలడానికి దోహదం చేసే అనారోగ్య జీవనశైలికి సంకేతం. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం బరువు, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి చర్యలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది" అని డాక్టర్ హండా చెప్పారు.
అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి.. జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, బయోటిన్ వంటి పోషకాల లోపాలకు దారి తీస్తుంది. ఈ లోపాల వల్ల జుట్టు బలహీనంగా, పెళుసుగా, రాలిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒత్తిడి అనేది జుట్టు రాలడానికి ఒక సాధారణ కారణం. అధిక పొట్ట కొవ్వు కలిగి ఉండటం కూడా దీర్ఘకాలిక ఒత్తిడికి సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.