Share News

Health Facts: అందరూ కామన్ గా చేస్తున్న ఈ బిగ్ మిస్టేక్ వల్లే ఏటా 50లక్షల మరణాలు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..

ABN , First Publish Date - 2023-11-30T14:31:31+05:30 IST

చాలామంది తమకు తెలియకుండానే మంచి అనుకుంటూ ఆరోగ్యం విషయంలో తప్పులు చేస్తున్నారు. దీని కారణంగా ఏటా 50లక్షల మంది మరణిస్తున్నారు.

Health Facts: అందరూ కామన్ గా చేస్తున్న ఈ బిగ్ మిస్టేక్ వల్లే ఏటా 50లక్షల మరణాలు..  షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..

ఆరోగ్యం పాడైపోవాలని ఎవరూ అనుకోరు. కాసింత అనారోగ్యం చేస్తే చాలు వైద్యులను కలుస్తారు. మందులు వినియోగిస్తారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంటి వాతావరణం గురించి కూడా జాగ్రత్త పడతారు. చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండటానికి, వేసవిలో ఇల్లు చల్లగా ఉండటానికి ఎన్నెన్నో మార్పులు చేసుకుంటారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే మంచి అనుకుంటూ ఆరోగ్యం విషయంలో తప్పులు చేస్తున్నారు. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 50లక్షల మంది మరణిస్తున్నట్టు సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అసలీ మరణాలు ఎలా సంభవిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి? తెలుసుకుంటే..

దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం.. ఇలా ఏ చిన్న జబ్బు చేసినా వెంటనే టాబ్లెట్స్ వినియోగించడం చాలామంది చేసే పని. కానీ ఇలా సొంతంగా మెడికల్ స్టోర్ లో మందులు కొని వినియోగించడం వల్ల శరీరం చాలా బలహీనపడుతుంది. ఈ కారణంగా పెద్ద జబ్బులు వచ్చినప్పుడు మందులు వినియోగించినా అవి శరీరం పై ప్రభావం చూపవు. కొన్నిసార్లు మందులు పనిచేయకపోయినా వైద్యులు మందులను మార్చి ఇస్తుంటారు. శరీరం మందులకు కూడా లొంగనంత బలహీనంగా మారిపోతోందని దీని అర్థం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వినియోగించడం 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' అనే సమస్య వస్తుంది. ఇది అంటువ్యాధుల కంటే చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతి సంవత్సరం కేవలం మందులు వినియోగించడం కారణంగానే కోటి మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

ఇది కూడా చదవండి: అల్లం ఎక్కువగా వాడుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..


యాంటీబయాటిక్స్ వల్ల శరీరం బలహీన పడితే కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోవడం, కాలేయం దెబ్బతినడం, ప్యాటీలివర్ సమస్య, సిర్రోసిస్-ఫైబ్రోసిస్ వంటి సమస్యలు వస్తాయి. చిన్నచిన్న గాయాలు మానడానికి కూడా నెలల వ్యవధి పట్టవ్చచు. కొన్నిసార్లు అవి మానకపోగా పెద్దగా రూపాంతరం చెందవచ్చు. సాధారంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వస్తే రోగనిరోధక శక్తి బాగుంటే 2-3 రోజుల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒకవేళ 2-3 రోజులలో తగ్గకపోతే సొంతంగా మందులు తీసుకోవడమనే అలవాటు మాని వైద్యులను సంప్రదించాలని హెచ్చిరించింది.కిడ్నీ సమస్యలున్నవారు, చిన్నపిల్లలు, యాంటీబయాటిక్స్ అలెర్జీ ఉన్నవారు, గుండె సంబంధ సమస్యలున్నవారు, పెద్దవారు సొంతంగా మందులు వాడటాన్ని నిషేదించాలి.

ఇది కూడా చదవండి: Health Tips: ఆయిల్ ఫుడ్స్ తిన్నా సరే కొవ్వు అస్సలు పెరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే..!


Updated Date - 2023-11-30T14:31:38+05:30 IST