Share News

Health Facts: ఆహారం తిన్న వెంటనే మీరూ ఈ పనులు చేస్తారా? ఈ 5 అలవాట్లు ఎంత చెడ్డవో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-04T15:15:02+05:30 IST

ఆహారం తిన్నవెంటనే చేసే ఈ అలవాట్లు సైలెెంట్ గా ప్రాణాలను కబళిస్తాయి. అందరూ కామన్ గా చేసే ఈ అలవాట్లేంటో తెలిస్తే షాకవుతారు.

Health Facts: ఆహారం తిన్న వెంటనే మీరూ ఈ పనులు చేస్తారా? ఈ 5 అలవాట్లు ఎంత చెడ్డవో తెలిస్తే..

ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునేవరకు తినడం, తాగడం, పనులు చేసుకోవడం మొదలైనవ విషయాలలో ఒక్కొక్కరికి ఒకో విధమైన శైలి ఉంటుంది. ఒక్కోరికి ఒకో అలవాటు ఉంటుంది. కానీ కొన్ని అలవాట్లు మాత్రం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. చాలామంది ఆహారం తిన్న వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. వీటి వల్ల చాలా ప్రమాదం కలుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో శరీరం చురుగ్గా ఉండదు. ఇలాంటి సమయాల్లో చాలామందికి ఉన్న ఈ 5 అలవాట్లు సైలైంట్ గా ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడతాయి. ప్రాణాలను చాలా సులువుగా నిమిషాల్లోనే తీయగల గుండెపోటు ఈ అలవాట్ల వల్లే వస్తుంది. అంత ప్రమాదకరమైన అలావాట్లు ఏంటి? తెలుసుకుంటే..

వ్యాయామం.. (Exercise)

చాలామంది శారీరకంగా ఫిట్ గా ఉండాలనే ఆలోచనతో రన్నింగ్ చేస్తుంటారు. రన్నింగ్ లేదా ఇతర వ్యాయామాలకు ముందు స్నాక్స్, జ్యూసులు, ఇతర పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి తగిన శక్తిని ఇస్తాయని కూడా నమ్ముతారు. కానీ ఆహారం ఏదైనా సరే తిన్నవెంటనే వ్యాయామం, పరుగు, ఆటలు ఆడటం మంచిది కాదు. తిన్న తరువాత కనీసం 10 నుండి 15నిమిషాలు గ్యాప్ తీసుకున్నతరువాతే వ్యాయామాలు చేయాలి. పైగా వీటిని కడుపు నిండుగా తీసుకోకూడదు.

Read Also: White Hair: ఎంత ప్రయత్నించినా తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం లేదా..? ఒక్కసారి ఈ పొడిని ట్రై చేయండి.. 30 రోజుల్లో..!



స్నానం.. (bath)

ఉదయం నిద్రలేవగానే వ్యాయామం చేసి, స్నానం చేసిన తరువాత ఏదైనా తినాలని పెద్దలు చెబుతుంటారు. కానీ చాలామంది ఉదయం లేవగానే వ్యాయామం ఆ తరువాత ఆహారం తిని ఆ తరువాత స్నానం చేస్తుంటారు. ఇలా ఉదయం తిన్న తరువాత స్నానం చేయడం గుండెకు చాలా ప్రమాదం కలిగిస్తుంది. కేవలం స్నానమే కాదు, ఈతకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే తిన్న తరువాత స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం ప్రభావితమవుతుంది.

నీరు..( water)

ఆహారంతో పాటు నీరు తాగడం చాలామంది చేసే పొరపాటు. ఆహారం తింటూ నీరు తాగినా, తిన్న తరువాత ఎక్కువ మొత్తంలో నీటిని తాగినా అది జీవక్రియను మందగిస్తుంది. దీని వల్ల ఉబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువ. పైపెచ్చు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

నిద్ర..(sleep)

నిద్ర ఆరోగ్యానికి మంచిదే అయినా తిన్న వెంటనే నిద్రపోవడం చాలా చెడ్డ అలవాటు. తిన్న వెంటనే నిద్రపోయేవారిలో అజీర్ణం, అదిక బరువు, ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యలకు కారణం అవుతుంది. తిన్న తరువాత ఆహారాన్ని జీర్ణం చేయడానికి రక్తం అవసరం. కానీ తిన్న వెంటనే నిద్రపోతే రక్తప్రసరణ మెదడువైపుకు మళ్లుతుంది. ఇది చాలా సమస్యలు సృష్టిస్తుంది.

బాత్రూమ్ కు వెళ్లడం.. (washroom)

మల, మూత్ర విసర్జనలు సాఫీగా జరగడం ఆరోగ్యం చక్కగా ఉందనడానికి పెద్ద సూచన. అయితే కొందరు తిన్న వెంటనే మలవిసర్జనకు వెళుతుంటారు. మరికొందరు మూత్రవిసర్జనకు కూడా వెళుతుంటారు. తిన్న వెంటనే ఇలా జరిగితే ఆరోగ్యం సరిగాలేదని అర్థం. అంతేకాదు మల, మూత్ర విసర్జకు వెళ్లాల్సివచ్చినప్పుడు దాన్ని బలవంతగా ఆపుకోకూడదు. ఇది గుండె నాళాల మీద ఒత్తిడికి కారణం అవుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

Read Also: Viral News: ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి ఈ మొక్కే సంజీవని లెక్క.. వీటి ఆకులతో ప్రమాదకర రోగాలు కూడా పరార్..!


Updated Date - 2023-11-04T15:15:04+05:30 IST