Health Facts: ఈ నిజాలు తెలియక ఇన్నాళ్లూ ఎంత నష్టపోయామో.. పండ్లు కూరగాయల తొక్కలను ఇలా కూడా వాడొచ్చని తెలియక..
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:54 PM
పండ్లు, కూరగాయల తొక్కలను ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలిస్తే షాకవుతారు..
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి గొప్పగా సహాయపడతాయి. విటమిన్లు, పోషకాలు, పైబర్ అందించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని ఉపయోగించే ముందు తొక్క తీయడం అందరూ సహజంగా చేసే పనే. ఈ తొక్కలను చాలామంది చెత్తబుట్టలో వడేస్తుంటారు. మరికొందరు మొక్కలకు ఎరువుగానూ వినియోగిస్తారు. అమ్మాయిలైతే ఫేస్ ప్యాకులు వేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. పండ్లు, కూరగాయల్లాగే వీటి తొక్కలలో కూడా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయల తొక్కలను వినియోగించే మార్గాలేమిటో తెలుసుకుంటే..
ఇంట్లో తయారుచేసుకునే పానీయాలకు పండ్ల తొక్కలతో అదనపు రుచి తీసుకురావచ్చు. కాక్ టెయిల్ లేదా మాక్ టెయిల్ ల రుచిని పెంచడంలో నారింజ, నిమ్మ వంటి తొక్కలు ఉపయోగపడతాయి. అలాగే దోసకాయ తొక్కలు ఉపయోగించి పానీయాలు రిఫ్రెష్ గా ఉండేలా చేయవచ్చు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే లెమన్ టీ తాగితే ఎన్ని లాభాలో..!!
కూరగాయల తొక్కలను చెత్తబుట్టలో వేయడమో లేదా మొక్కలకు ఎరువుగా వేయడమో చేస్తుంటారు. కానీ వీటని బాగా శుభ్రం చేసి ఉడికించి సూపులలో వినియోగించవచ్చట. దీనివల్ల సూపులో పోషకాల కంటెంట్ రెట్టింపవుతుంది. సాంబార్, రసం వంటి వంటల్లో కూడా వీటిని వాడుకోవచ్చు.
బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి డిటాక్స్ వాటర్, డిటాక్స్ టీ, డిటాక్స్ పానీయాలు తాగుతుంటారు. పండ్ల తొక్కలను, కూరగాయల తొక్కలను వీటి తయారీలో వినియోగించవచ్చు. పండ్ల తొక్కల నీటిని మరిగించి చల్లారిన తరువాత తేనె కలిపి తీసుకోవచ్చు, హెర్బల్ టీ లానూ తాగవచ్చు.
బంగాళాదుంపలను తొక్కలను కూడా చిప్స్ లా తయారుచేయవచ్చు. బంగాళాదుంప తొక్కలకు కాసింత ఆయిల్ స్ప్రే చేసి వాటిని బేకింగ్ లేదా ఎయిర్ ఫ్రైయర్, లేదా నాన్ స్టిక్ పాన్ లో సన్నని మంట మీద వేయించాలి. దీనికి మిరియాల పొడి, ఉప్పు కలిపి తినవచ్చు. చాలా రుచి, మరింత ఆరోగ్యం.
కూరగాయల తొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటితో పులుసు వండటం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి నిల్వ ఉంచుకున్నా కూడా కావలసినప్పుడు వాడుకోవచ్చట. సూపులలో కూడా వినియోగించుకోవచ్చు.
క్యారెట్, ఆరెంజ్, బీట్రూట్, బంగాళా దుంప, నిమ్మ మొదలైన తొక్కలను ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని సూపులలోనూ, ఇతర వంటకాల మీదా పొడిలా చల్లుకోవచ్చు. కూరగాయల తొక్కలను సూపులలో వాడుకోవచ్చు.
తొక్కలను ఉపయోగించడానికి ఇంత ప్రాసెస్ చేయడం ఆసక్తి లేకపోతే సింపుల్ గా అప్పటికప్పుడు ఉపయోగించే మార్గాలు కూడా ఉన్నాయి. దోసకాయ తొక్కలను మొటిమలను తగ్గించడానికి, ఉల్లిపాయ తొక్కలను డిటాక్స్ డ్రింక్స్ గానూ, పుచ్చకాయ తొక్కల తెలుపు భాగాన్ని కూరలు, పాయసాలు, టూటీ ఫ్రూటీ వంటివి తయారుచేసుకోవచ్చు.