Health Food: మసాలా ఆహారం తింటే ఎంతవరకు మంచిది.. మన జీర్ణక్రియ ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం.
ABN , First Publish Date - 2023-05-08T15:31:37+05:30 IST
స్పైసీ ఫుడ్ తినడం బరువు తగ్గడంలో సహాయపడుతుందా? ..
ప్రపంచవ్యాప్తంగా పాకశాస్త్రంలో మసాలాలు లేని వంటకాలు లేవు. ఇవి వంటకానికి రంగు, రుచి, వాసనను కలిగిస్తాయి. సాంప్రదాయ వంటకాల్లో ముఖ్యంగా మిరపకాయలు, నల్ల మిరియాలు వంటి మసాలాలు ఎక్కువగా వినియోగిస్తుంటాం. కొంతమంది రోజూ మసాలాతో వండిన ఆహారాన్ని ఇష్టపడతారు. కానీ అందరికీ అలా తినాలనిపించదు. మసాలా ఎక్కువగా తింటే కడుపుతో ఇబ్బందిగా ఉంటుందని చాలామంది తక్కువగా తీసుకుంటుంటారు. ఇతర పదార్థాల మాదిరిగానే సుగంధద్రవ్యాలు కూడా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయని భావిస్తుంటారు. స్పైసీ ఫుడ్ తినడం బరువు తగ్గడంలో సహాయపడుతుందా? మసాలా ఆహారం మన జీర్ణక్రియ ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం.
మసాలాతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు ఈ కడుపు రోగాలకు కారణం కావచ్చు:
1.యాసిడ్ రిఫ్లక్స్:
స్పైసీ ఫుడ్ తీసుకుంటే కడుపులో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కడుపులో చికాకు కలిగిస్తుంది. ఇది ఎవరికైనా కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు. అంతే కాదు కొన్నిసార్లు ఇది కడుపు ఉబ్బరం, నొప్పికి కూడా దారితీస్తుంది.
2. తీవ్రమైన గ్యాస్ట్రిక్స్
చాలామంది తరుచుగా పొట్టలో పుండ్లు పడుతుంటారు. ఇది పొట్టను సక్రమంగా ఉంచే సన్నని పొర గ్యాస్ట్రిక్ శ్లేష్మం వాపు కారణంగా పొట్టలో పుండ్లు ఏర్పడతాయి.ఇవి తరచుగా అజీర్తిని కలిగిస్తుంటాయి. వికారం, వాంతులు, తలనొప్పి, మలం, వాంతిలో రక్తం తీవ్రమైన గ్యాస్ట్రిటిస్ లక్షణాలు.
3. అతిసారం
ఒక్కోసారి మసాల ఫుడ్ వల్ల విరోచనాలు అవుతుంటాయి. మసాలా ఫుడ్ తిన్నప్పుడు కడుపులో అదోరకంగా ఉండి కడుపునొప్పితో కలవరపెడుడతుంది. విరోచనాలరగ దారి తీసుతీస్తుంది. కాస్త సున్నితత్వం ఉన్నవారిలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.
స్పైసీ ఫుడ్ తినడం బరువు తగ్గడంలో సహాయపడుతుందా?
మిరపకాయలు, మిరియాలు వంటి మసాలాలు బరువు తగ్గడంలో సహాయపడతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే మిరపకాయలో క్యాప్సైసిన్, పెప్పర్‌లో పైపెరిన్ ఉంటుంది. ఇది శరీర జీవక్రియను పెంచడంలోనూ కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ సమాచారం ప్రకారం..మీరు వాటిని అధిక పరిమాణంలో తీసుకుంటే అవి మీ ఆకలిని కూడా తగ్గిస్తాయి. మసాలా ఆహారంలో క్యాప్సైసిన్ కొవ్వును కరిగించి మీ జీవక్రియను పెంచుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గడానికి మీకు పోషకాహార ప్రణాళిక, లక్ష్య వ్యాయామం అవసరం.