Health food: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ జ్యూస్‌లతో లాభాలెన్నో!
ABN , First Publish Date - 2023-05-07T20:04:18+05:30 IST
అన్ని జ్యూస్‌లు బ్రేక్‌ఫాస్ట్(Breakfast)లో మంచివి కావు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ జ్యూస్ తాగితే మంచిది ..
చాలామంది రోజు మొత్తంలో తమకు ఇష్టమైన జ్యూస్(juices)లతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అన్ని జ్యూస్‌లు బ్రేక్‌ఫాస్ట్(Breakfast)లో మంచివి కావు. కొన్ని రకాల జ్యూస్‌లలో వల్ల ఎసిడిటీకి కారణమయ్యే అవకాశం ఉంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ జ్యూస్ తాగితే మంచిది అనేది తెలుసుకోవడం చాలా కీలకం. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ముఖ్యమైన మూడు జ్యూస్‌లు మీకోసం..
బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన జ్యూస్‌లు:
1.క్యారట్ జ్యూస్(Carrot juice)
క్యారెట్ జ్యూస్ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి ఆహారం. నిజానికి క్యారెట్ జ్యూస్‌లో ఫ్లేవనాయిడ్లు,కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి ఉత్తేజపరుస్తుంది. క్యారెట్ జ్యూస్ పొట్టలోని pHని బ్యాలెన్స్ చేస్తుంది, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
2. బీట్రూట్ జ్యూస్ (Beetroot juice)
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలోని ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల మీ మెటబాలిజం ఫాస్ట్‌గా ఉంటుంది. శరీరానికి శక్తినిస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
3. ఆకుకూరలతో జ్యూస్(Green juice)
ఆకుపచ్చ, ఆకు కూరలతో తయారైన ఈ రసం మీ జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపు, ప్రేగుల కదలికను పెంచుతుంది. పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కాలేయం వేగంగా పని చేస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. అంతే కాకుండా ఈ జ్యూస్‌లోని ప్రోటీన్లు, ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
కాబట్టి, ఆరోగ్యవంతమైన శరీరంకోసం ఈ పానీయాలను అల్పాహారంలో చేర్చుకోవచ్చు. ఇవి మీకు ఎసిడిటీ దూరం చేస్తాయి. బరువును నియంత్రిస్తాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడతాయి.