Share News

Health Tips: ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని రెగ్యులర్ గా తింటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-22T08:30:20+05:30 IST

ఓట్స్ ను రోజూ తింటే బరువు తగ్గడం మాట ఏమో కానీ.. జరిగేది మాత్రం ఇదే..

 Health Tips: ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని రెగ్యులర్ గా తింటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

ఓట్స్ ఫైబర్ అధికంగా ఉన్న ఆరోగ్యకరమైన తృణధాన్యం. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది ఓట్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్ లో విటమిన్-ఇ, బి, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి శరీరానికి తగిన శక్తిని ఇస్తూ అధికబరువు తగ్గడంలో తోడ్పడతాయని అంటారు. ఓట్స్ ను దోశ, ఇడ్లీ, ఉప్మా, కిచిడి ఇలా చాలారకాలుగా వండుకోవడం వల్ల ప్రతి రోజూ ఖచ్చితంగా వీటిని ఆహారంలో భాగం చేసుకునేవారు ఉన్నారు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అని భావిస్తుంటారు. కానీ ఓట్స్ ను రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి కోరి ముప్పు తెచ్చుకున్నట్టేనని పరిశోధనలు చెబుతున్నాయి. ఎంతో ఆరోగ్యం అనుకునే ఓట్స్ గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే..

ఓట్స్(Oats) గ్లూటెన్ ఫ్రీ అనే కారణంతో ఎలాంటి సందేహం లేకుండా తినేస్తుంటారు. అయితే వీటని ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేస్తారు. ఇదే ఫ్యాక్టరీలలో గోధుమలు, బార్లీ కూడా ప్రాసెస్ చేస్తారు. అన్నింటిని ఒకే చోట ప్రాసెస్ చేయడం వల్ల క్రాస్ పొల్యూషన్ జరుగుతుంది. దీని కారణంగా ఓట్స్ తినడం ఒకింత హానికరమేనని తేలింది. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు, జీర్ణాశయ సమస్యలున్నవారు రోజూ ఓట్స్ తింటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు చాలా తొందరగా పెరుగుతాయి.

చాలామంది డయాబెటిస్(diabetes) సమస్య ఉన్నవారు ఓట్స్ ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజూ ఓట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి(increase sugar levels).

Viral Video: రోజూ ఏదో కుడుతున్నట్లు ఉన్నా మొదట అనుమానం రాలేదు.. చివరకు ఓ రోజు ఇంటి సీలింగ్ బద్ధలుకొట్టి చూస్తే..



బరువు తగ్గాలనే ఆలోచనతో ఓట్స్ తినేవారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఓట్స్ తింటే బరువు తగ్గకపోగా బరువు పెరిగే అవకాశాలే ఎక్కువ(weight gain) ఉంటాయి. ఇందులో ఉన్న చక్కెర స్థాయిలు, కార్బోహైడ్రేట్స్ ఇందుకు కారణం అవుతాయి. అందుకే ఓట్స్ ను రోజూ తినొద్దని అంటున్నారు.

కిడ్నీ సమస్యలు(Kidney problems) ఉన్నవారు ఓట్స్ తినడం చాలాప్రమాదం. ఇందులో భాస్వరం ఎక్కువమొత్తంలో ఉంటుంది. దీన్ని పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల ఖనిజాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాలను మరింత దెబ్బ తీస్తుంది.

ఓట్స్ తీసుకుంటే అలర్జీ సమస్యలు(allergy) వచ్చే అవకాశం ఉంది. ఓట్స్ ను ఎక్కువగా వినియోగించేవారిలో దద్దుర్లు, దురద, చర్మం చికాకు పెట్టడం వంటి సమస్యలు వస్తుంటాయి. చాలామంది వీటిని గమనించరు, గమనించినా దానికి ఓట్స్ కారణమనే విషయాన్ని నమ్మలేరు.

మార్కెట్ లో లభించే ఓట్స్ లో ఇన్స్టంట్ ఓట్స్, ప్లేవర్డ్ ఓట్స్ చాలా ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. వీటి తయారిలో రుచి, రంగు, వాసన కోసం ఎక్కువ మొత్తంలో చక్కెరలు, సోడియం, ప్రిజర్వేటివ్ లు ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.

Health Tips: భోజనం తరువాత స్వీట్లు తింటే ఆ మజానే వేరు.. కానీ ఈ నిజాలు తెలిస్తే..


Updated Date - 2023-10-22T08:30:20+05:30 IST