Health Tips: టమోటాలను తింటే వచ్చే లాభాలేంటి..? గర్భంతో ఉన్న వాళ్లు అసలు టమోటాలను తినొచ్చా లేదా అంటే..!

ABN , First Publish Date - 2023-09-27T10:15:20+05:30 IST

రోజూ ఒక టమోటా తింటే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. కానీ మధుమేహం ఉన్నవారు, గర్భవతులు టమోటాలు కూరల్లో వాడే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. అసలు నిజమేంటంటే..

Health Tips: టమోటాలను తింటే వచ్చే లాభాలేంటి..? గర్భంతో ఉన్న వాళ్లు అసలు టమోటాలను తినొచ్చా లేదా అంటే..!

టమాటాలు పేదవారి నుండి అన్ని వర్గాల ప్రజలు వాడుతారు. టమోటా లేని వంట అంత రుచికరంగా ఉండదు. ధరలు పెరిగినా సరే అరకొరగా అయినా వినియోగించుకుని తృప్తి పడ్డారు కానీ పూర్తీగా మానెయ్యలేదు. వివిధ రకాల ఖరీదైన పండ్లతో పోలిస్తే టమోటాలలో పోషకాలు ఎక్కువ అని, రోజుకొక టమోటా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. అయితే వర్షాకాలం వస్తే చాలామంది టమోటాలను దూరం పెడుతుంటారు. కానీ వర్షాకాలంలో కూడా టమోటాలను తినవచ్చునని, టమోటాల వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆహారనిపుణులు చెబుతున్నారు. ఇక గర్భవతులు టమోటా తినచ్చా లేదా అనే సందిగ్దం కూడా కొందరు వ్యక్తం చేస్తుంటారు. టమోటా తినడం వల్ల కలిగే లాభాలు, గర్భవతుల ఆరోగ్యం విషయంలో టమోటా గురించి నిజానిజాలు తెలుసుకుంటే..

టమోటా(Tomato)లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను, రక్తపోటును తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇది గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది.

టమోటాలలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు టమోటా చాలా మంచిది.

టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందులో ఇందులో బీటా-కెరోటిన్, లుటీన్ కంటెంట్ సమృద్దిగా ఉంటుది. ఇది కంటి శుక్లం, ఇతర కంటి వ్యాధుల ప్రమాదం నుండి కళ్ళను రక్షిస్తుంది.

Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!


టమోటాలో లైకోపీన్ అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. టమోటాలలో ఉండే ఎరుపు రంగు దీనికి సహకరిస్తుంది.

టమోటాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైపెచ్చు ఇందులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా మధుమేహాం(diabetes) ఉన్నవారు టమోటాలను నిరభ్యరంతంగా తినవచ్చు. అయితే వీటిని మితంగానే తినాలి. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి.

గర్భవతులు(Pregnancy womens) టమోటా తినవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ టమోటాలలో ఉండే ఫోలేట్ గర్భవతులకు ఎంతగానో అవసరం అవుతుంది. ఫోలేట్ గర్భంలో ఉన్న శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్దికి అవసరం. టమోటాలో పొటాషియం, విటమిన్-సి సమృద్దిగా ఉంటుంది. ఇవి తల్లీ బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైనవి. అయితే టమోటాలను చాలా జాగ్రత్తగా వాడాలి. పంటకోసం రసాయనాలు వినియోగించి ఉంటారు కాబట్టి వాటిని బాగా శుభ్రపరచాలి.

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!


Updated Date - 2023-09-27T10:15:20+05:30 IST