Health Tips: ముక్కులో రెండు చుక్కల నెయ్యిని రోజూ వేస్తే జరిగేది ఇదా..? ఈ డాక్టర్ చెప్పేది వింటే అవాక్కవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-05-19T19:10:51+05:30 IST
తీపి వంటకాల నుండి మసాలా వంటకాల వరకూ ఎన్నింటినో నెయ్యి ఘుమఘుమలాడిస్తుంది. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. అయితే ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఇంది. నెయ్యిని అమృతంతో పోలుస్తారంటే అందులో ఉన్న ఔషద గుణాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. నెయ్యిని ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముక్కులో రెండు చుక్కలు వేసుకుంటే చాలు..
భారతీయ భోజనంలో నెయ్యికి(Ghee) చాలా గొప్ప స్థానం ఉంది. తీపి వంటకాల(sweets) నుండి మసాలా వంటకాల(Masala foods) వరకూ ఎన్నింటినో నెయ్యి ఘుమఘుమలాడిస్తుంది. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. అయితే ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఇంది. నెయ్యిని అమృతంతో పోలుస్తారంటే అందులో ఉన్న ఔషద గుణాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. నెయ్యిని ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముక్కులో రెండు చుక్కలు(2drops ghee in nose) వేసుకుంటే చాలు అద్బుతం జరుగుతుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు(Ayurvedic Doctors). ఇంతకీ నెయ్యి ముక్కులో ఎందుకు వేసుకోవాలి? దీనివల్ల కలిగే ఫలితాలేంటి? తెలుసుకుంటే..
ఆయుర్వేదంలో 'నాన హి శిరసో ద్వారం' అని ఓ మాట ఉంది. అంటే ముక్కు మెదడులోకి ప్రవేశద్వారం అని దీని అర్థం. తల, నోరు, జుట్టు, దంతాలు, చెవులు, ముక్కు, కళ్ళు ఇలా మొత్తం అన్ని అవయవాల ఆరోగ్యానికి నెయ్యిని ముక్కులో వేయడమనే ప్రక్రియ సహాయపడుతుంది. దీన్ని నస్య చికిత్స(Nasya) అని అంటారు. రోజు ముక్కుల్లో నెయ్యి వేసుకోవడం వల్ల తీవ్రమైన జబ్బులు కూడా చక్కా వెళ్ళిపోతాయట.
Anand Mahindra Tweet: ఇది కదా అసలు సిసలు ఆనందమంటూ.. ఆనంద్ మహీంద్రా పోస్ట్.. వాళ్ల సంతోషానికి కారణమేంటంటే..!
ఏ ఏ జబ్బులు తగ్గుతాయంటే..
ముక్కుల్లో రెండు చుక్కల నెయ్యిని వేసుకోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి(sleeping problems), మంచి నిద్రపడుతుంది(good sleep).
సాధారణ తలనొప్పి నుండి మైగ్రేన్(common head ache to migraine) వరకు ఎన్నో తలనొప్పులకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.
వాడిపోయి నిస్తేజంగా ఉన్న చర్మానికి మెరుపును ఇస్తుంది, చర్మం నిగనిగలాడేలా(Skin brightening and shining) చేస్తుంది.
రోగనిరోధక శక్తిని మాత్రమే కాదు జ్ఞాపకశక్తిని(increase Immunity power and memory power) మెరుగుపరుస్తుంది.
అలర్జీలను తగ్గిస్తుంది.
మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక అలసట (Psychological problems)వంటి సమస్యలను తగ్గిస్తుంది.
జుట్టు రాలడం తగ్గించడంతో పాటు జుట్టు నెరసిపోకుండా(hair fall and white hair) చేయడంలో సహాయపడుతుంది.
మెదడుకు పోషణనివ్వడం ద్వారా సరైన ఆలోచనా తీరు, చురుగ్గా పనిచేసే సామర్యం పెంచుతుంది(increase brain power).
ఇవి మాత్రమే కాకుండా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్(autoimmune thyroid), రుమటాయిడ్ ఆర్థరైటిస్(rheumatoid arthritis), మల్టిపుల్ స్క్లెరోసిస్(multiple sclerosis)) వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ ట్రిక్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.
ఎప్పుడెంత నెయ్యి వేసుకోవాలంటే..
స్వచ్చమైన ఆవునెయ్యిని ఉదయం బ్రష్ చేశాక లేదా రాత్రి పడుకునేముందు(morning after brush or night before bed) డ్రాపర్ సహాయంతో కానీ చిటికెన వేలి సహాయంతో కానీ ముక్కు రెండు రంధ్రాలలో రెండు చుక్కలు వేసుకోవాలి.