Health Tips: 30-30-30 రూల్ గురించి విన్నారా? ఫిట్ గా స్లిమ్ గా ఉండేవారి సీక్రెట్ ఇదేనట..
ABN , First Publish Date - 2023-10-25T12:40:33+05:30 IST
ఆరోగ్యంగా, ఫిట్ గా, స్లిమ్ గా ఉండేవారు ఫాలో అయ్యే సీక్రెట్ రూల్ ఇదేనని తేలింది. ఈ రూల్ ఫాలో అయితే అధిక కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే కనీసం సంపాదించుకున్నది అయినా సంతోషంగా తినగలం. కానీ చాలామంది శారీరకంగా ఫిట్ గా లేరన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అధికబరువు అనారోగ్యాలకు ముఖ్యకారణం అవుతుంది. మధుమేహం, గుండెజబ్బులు, జీర్ణసంబంధ సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవేవీ రాకూడదన్నా, శరీరం ఫిట్ గా, స్లిమ్ గా ఉండాలన్నా 30-30-30 రూల్ ఫాలో అవ్వాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అసలు 30-30-30 రూల్ ఏంటి? దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? దీని వల్ల కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
30-30-30 లో మూడు రకాల నియమాలు ఉన్నాయి. వ్యాయామం(exercise), పోషకాహారం(Protein), ఆహారం తీసుకోవడం(mind full eating).. ఈ మూడు ఫాలో అయితే చాలు శరీరంలో అధిక కొవ్వు ఐస్ లా కరిగిపోతుందట.
30 నిమిషాల వ్యాయామం..
ప్రతిరోజూ 30నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి చక్కని మార్గం. శరీరంలో కేలరీలను బర్న్ చేయడమే కాకుండా శరీరం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసే అలవాటు శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది, హృదయనాళ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ తప్పకుండా 30నిమిషాలు వ్యాయామం చేసేవారు ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటారు.
Viral Video: వావ్ ఏం టెక్నిక్ బాస్.. చేతులు నొప్పులు రాకుండా గోధుమలను ఎలా శుభ్రం చేస్తున్నారో చూస్తే..
30గ్రాముల ప్రోటీన్..
అధికబరువు తగ్గడానికి ప్రోటీన్ తీసుకోవడం ఎంతో అవసరం. ప్రాసెస్ చేయబడిన ఆహారం, జంక్ పుడ్ తీసుకోవడం మానేయాలి. ఆహారంలో ఆకుకూరలు, తృణధాన్యాలు, మిల్లెట్లు, పండ్లు తీసుకోవాలి. రోజుకు కనీసం 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. సరైన ఫిట్నెస్ మెయింటెన్ చేసేవారు కచ్చితంగా రోజూ 30గ్రాముల ప్రోటీన్ తమ ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడతారు.
30నిమిషాలు భోజన సమయం..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు, ఆహారం తీసుకునే విధానం కూడా ఆరోగ్యం మీద, శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో మైండ్ ఫుల్ ఈటింగ్ బాగా ప్రాచుర్యం పొందింది. భోజనానికి 30నిమిషాల సమయం కేటాయించాలని చెబుతున్నారు. సినిమాలు, టీవి, మొబైల్ చూస్తూ తినడాన్ని మానుకోవాలి. తినేటప్పుడు తింటున్న ఆహారం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ధ్యానం, ఒత్తిడి తగ్గించే వివిధ ధ్యాన పద్దతులు ఫాలో కావాలి. ఆహారాన్ని హడావిడిగా కాకుండా దాని మీద ఇష్టంతో తినేవారు ఆ ఆహారం నుండి అమితమైన శక్తిని కూడా పొందుతారు.