Health Tips: అందరికీ కామన్ గా ఉండే ఈ 5 అలవాట్లే కొంప ముంచుతున్నాయ్.. వెంటనే వీటిని వదలకపోతే ఎంత నష్టమంటే..
ABN , First Publish Date - 2023-08-15T16:25:47+05:30 IST
ఇవేం పెద్ద సమస్య కాదులే అనుకునే ఈ 5 అలవాట్లే బోలెడు రోగాలకు కారణమవుతున్నాయి..
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారు. దీనికి తగ్గట్టు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఏమైందో తెలియక కంగారు పడుతుంటారు. కానీ రోజులో అందరికీ కామన్ గా ఉండే 5 అలవాట్లే కొంప ముంచుతున్నాయి. మధుమేహం, గుండెపోటు, ఫ్యాటీ లివర్, రక్తపోటు, హార్మోన్ ఇంబాలెన్స్, కిడ్నీల పనితీరు దెబ్బతినడం .. ఇలా బోలెడు జబ్బులు చాపకింద నీరులా శరీరంలో చేరుతున్నాయి. వీటన్నింటికి కారణమయ్యే ఆ 5 అలవాట్లు ఏమిటో తెలుసుకుని వీటిని వదిలేయడం చాలా ముఖ్యం. అవేంటంటే..
ఆఫీసులలోనూ, ఇళ్ళలోనూ చాలామంది వర్క్ చేస్తూ బిజీగా ఉంటారు. కనీసం సిస్టమ్ ముందు నుండి పక్కకెళ్ళి 10నిమిషాలు భోజనానికి కేటాయించాలంటే తెగ కంగారు పడతారు. అందుకే వర్క్ చేస్తూనే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి భోజన కార్యక్రమం కానిస్తుంటారు. ఇక ఇళ్ళలోనూ సీరియళ్ళు, సినిమాలు చూడటం సరేసరి. ప్రతి ఇంట్లో భోజన సమయంలో ఇంటిల్లిపాది టీవీ చూస్తూ తినడం సహజంగా జరిగే పని. కానీ ఇలా పనిచేస్తూనో, టీవీ చూస్తూనో తినడం వల్ల పెద్ద సమస్యలే వస్తాయి. దృష్టి మొత్తం పని మీద, టీవీ మీద ఉన్నప్పుడు ఏం తింటున్నామనే విషయంపై శరీరానికి, మెదడుకు అవగాహన ఉండదు. మనిషి ఏ పని చేస్తుంటే శరీరంలో ఆ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. ఇలా పనిచేస్తూ తినడం(Eating food while working) వల్ల ఆహార వ్యవస్థ, జీర్ణాశయ వ్యవస్థ అంతగా సన్నద్దం కాదు. మంచి ఆహారం తీసుకున్నా సరే పోషకాహార లోపానికి, అవహాన లేకుండా తినేడం వల్ల అధిక బరువుకు, జీర్ణసంబంధ సమస్యలకు కారణం అవుతుంది.
Viral Video: బాబోయ్ కొండముచ్చుకు ఇంత ఆవేశమా? సింహాన్ని సింగిల్ గా ఉరికించింది..
ఈ మధ్య కాలంలో ఆహారంలో వినియోగించే నూనెల విషయంలో చాలా మార్పు వచ్చింది. ఆలివ్ నూనె(Olive oil) ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మంది దీన్ని వాడుతున్నారు. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. కానీ దీన్ని వేడి చేయకూడదు. కొన్ని రకాల వంటల తయారీలో చాలామంది ఆలివ్ నూనె వాడతారు. కానీ దీన్ని వేడిచేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు తగ్గిపోవడమే కాదు, చాలా ప్రమాదకరమైన టాక్సిన్ లు వెలువడతాయి. ఆలివ్ ఆయిల్ ను కేవలం సలాడ్ లలో నిమ్మరసంలా అరస్పూన్ నుండి స్పూన్ మోతాదులో కలుపుకోవాలి.
శారీరక శ్రమ చేసేవారికంటే మానసిక శ్రమ చేసేవారిలో ఆకలి విషయంలో గందరగోళం ఉంటుంది. పనిలో మునిగిపోయి వేళకు సరిగా తినకపోవడం వల్ల ఆహార వ్యవస్థ దెబ్బతింటుంది. కొందరు రాత్రి భోజనం ఆలస్యంగా తీసుకుంటే మరికొందరు సమయవేళలు మైంటైన్ చెయ్యకపోవడం వల్ల అర్థరాత్రిళ్ళు ఆకలి సమస్య ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఏదో ఒకటి కడపునింపుకోవాలనే ఆలోచనలో ప్యాక్డ్ ఫుడ్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. శరీరంలో అవయవాలన్నీ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలాంటివి తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ చాలా తొందరగా వస్తుంది. ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతుంది.
ఇప్పటికాలంలో వ్యాయామం చేసేవారు తక్కువ. కొందరు పనుల సాకుతో తప్పించుకుంటే, మరికొందరు దొరికే కొద్దపాటి సమయాన్ని సినిమాలు, మొబైల్ బ్రౌజింగ్ లో గడిపేస్తుంటారు. వారంలో కనీసం 150నిమిషాల శారీరక శ్రమ లేదా వ్యాయామం చెయ్యాలి. ఇది శరీరం ఫిట్ గా ఉండటంలో సహాయపడుతుంది. రోజు కొంతసమయం వ్యాయామానికి వెచ్చించనివారు తొందరగా అనారోగ్యం బారిన పడతారు.
శరీరం చక్కగా పనిచేయాలంటే డీహైడ్రేషన్ కు గురి కాకూడదు. ఇందుకోసం ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి(drink water daily 2-3 liters). శరీరంలో నీరు తగ్గితే తొందరగా అలసిపోయేలా చేస్తుంది. గుండె, మెదడు పనితీరు తగ్గుతుంది. అందుకే రోజు కనీసం 2నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి.