Health Tips: ఈ 9 టిప్స్ ఫాలో అయితే చాలు.. మానసిక సమస్యలన్నీ పరార్..!
ABN , First Publish Date - 2023-12-13T13:30:27+05:30 IST
మానసిక సమస్యలను చాలామంది భూతద్దంతో చూస్తుంటారు. కానీ ఈ 9 టిప్స్ పాలో అయితే వాటిని అదిగమించడం చాలా సులువు..
ఈ టెక్నాలజీ కాలంలో అధికశాతం మంది హడావిడి జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు పరుగు తీసినట్టే పనులు చేస్తారు. ఆఫీసు, ఉద్యోగం, కుటుంబం ఇతర పనులకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలమై చాలావరకు ఒత్తిడికి లోనవుతారు. దీంతో మానసిక సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు పెరిగే కొద్ది జీవితానికే పెద్ద ముప్పు కలిగిస్తాయి. మానసిక సమస్యలను చాలామంది భూతద్దంతో చూస్తుంటారు. కానీ వీటిని అధిగమించడానికి ఈ కింది 9 టిప్స్ ఫాలో అయితే చాలు..
మార్నింగ్ రొటీన్ అనేది రోజును ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఉదయాన్నే లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. రోజులో చేయాల్సిన పనుల మీద స్పష్టత పెరుగుతుంది.
మానసిక సమస్యలు చాలావరకు శరీర స్థితిపై ఆధారపడి ఉంటాయి. శారీరక వ్యాయామం చేస్తే శరీరంలో ఎండార్పిన్లు విడుదల అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. వ్యాయామాలు, జిమ్ వర్కౌట్, డాన్స్, యోగా వంటివి చేయాలి.
ఇది కూడా చదవండి: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు!
ఆహారం కూడా మానసిక సమస్యలపై ప్రభావం చూపిస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
నిద్ర గొప్ప ఔషదం అంటారు. నాణ్యమైన నిద్ర ఉంటే మానసిక సమస్యలే రావు.7నుండి9 గంటల నిద్ర మానసిక అలసటను తగ్గిస్తుంది.
ఈ మధ్యకాలంలో మైండ్ ఫుల్నెస్ అభ్యాసాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి పనిని మనసు పెట్టి చేయడం వల్ల చాలా పాజిలివ్ ఫలితాలు లభిస్తాయి. సంతోషంతో కూడిన విషయాల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం, సమస్యలున్న క్షణాలను అంగీకరించడం వల్ల క్లిష్ట సమయాలు కూడా సాఫీగా గడిచిపోతాయి.
మానసిక సమస్యలు అధిగమించడానికి మానవ సంబంధాలు కూడా సహాయపడతాయి. స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడటం, చర్చించడం, సమస్యలను విశ్లేషించడం ద్వారా మానసిక సమస్యలు అధిగమించవచ్చు.
లక్ష్యాలను నిర్థేశించుకోవడం, వాటిని సకాలంలో పూర్తీ చేయడం వల్ల కూడా ఒత్తిడి ఉండదు. పెద్ద లక్ష్యాలను చిన్న టార్గెట్లుగా విభజించుకుంటే వాటిని సాధించడం సులువు.
ఫోన్, ల్యాప్టాప్, టీవి వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి బ్రేక్ తీసుకోవాలి. వాటికి ఒక నిర్ణీత సమయం కేటాయించుకోవడం వల్ల మిగిలిన సమయాన్ని అభిరుచులు, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి పనులకు కేటాయించుకోవచ్చు.
మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వృత్తిపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అందుకే వృత్తి విషయాలలో సహాయం తీసుకోవడం అవసరం. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం,కౌన్సెలింగ్ వంటివి చాలా సహాయపడతాయి.