Heart Attack in Younger Age: 30 ఏళ్ల వయసు కూడా లేకున్నా హార్ట్ అటాక్‌లు.. ఈ 5 అంశాలే అసలు కారణాలు..!

ABN , First Publish Date - 2023-09-19T17:06:58+05:30 IST

గుండె పోటు ఒకప్పుడు బాగా వయసైన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా నిండకనే గుండెపోటు సమస్యలొస్తున్నాయి. దీని గురించి పరిశోధనలు చేస్తే బయటపడ్డ నిజాలు ఇవీ..

Heart Attack in Younger Age: 30 ఏళ్ల వయసు కూడా లేకున్నా హార్ట్ అటాక్‌లు.. ఈ 5 అంశాలే అసలు కారణాలు..!

గుండె పోటు ఒకప్పుడు బాగా వయసైన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా నిండకనే గుండెపోటు సమస్యలొస్తున్నాయి. వాకింగ్ చేస్తూ కొందరు, డ్యాన్సులు చేస్తూ మరికొందరు, వర్కౌట్లు చేస్తూ మరికొందరు, అందరితో సరదాగా గడుపుతూ ఇంకొందరు అర్థాంతరంగా గుండెపోటుకు గురై నిమిషాలలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు అంత చిన్న వయసులో గుండెపోటు రావడానికి కారణమేంటని చేసిన పరిశోధనలలో 5 ప్రధాన కారణాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ 5 కారణాల వల్లే చిన్నతంలో గుండెపోటు వస్తోంది. అవేంటో తెలుసుకంటే..

పని ఒత్తిడి..(work pressure)

ఇప్పట్లో యువత పని మొత్తం మానసికంగా జరిగేదే. దీని కారణంగా యువత ఒత్తిడికి గురవుతున్నారు. ఎప్పుడూ కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్ మొదలైన వాటిలో బిజీ బిజీగా గడుపుతూ ఆహారం, వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. టార్గెట్ల పేరుతో తమను తాము ఒత్తిడిలోకి నెట్టుకుంటున్నారు. ఇది చిన్నవయసులోనే గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

Health Tips: 35 ఏళ్ల వయసు దగ్గరపడిందా..? ఎంత ప్రయత్నించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా..? అయితే..!



ధూమపానం, మద్యపానం..(smoking and drinking)

ధూమపానం , మద్యపానం నేటికాలంలో ఫ్యాషన్ లో భాగం అయిపోయింది. సిగరెట్, ఆల్కహల్ తీసుకోని వారిని చిన్నచూపు చూస్తుంటారు. ఇక నగరాలలో నివసించేవారు తొందరగానే ఇందులో చిక్కుకుంటారు. మరికొందరు పని ఒత్తిడి నుండి బయటపడటానికి తాత్కాలిక ఉపశమనం కోసం పొగతాగడం, మద్యం సేవించడాన్ని ఎంచుకుంటారు. కానీ ఇవే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నాయి.

ఊబకాయం..(obesity)

అధికబరువు అన్ని రోగాలకు కేంద్ర బిందువు. యువతలో జంక్ ఫుడ్స్ మీద ఉన్న మోజు అంతా ఇంతా కాదు. ఒకేచోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, బయటి ఆహారం, పని ఒత్తిడి మొదలైనవన్నీ ఊబకాయంకు దారితీస్తాయి. ఈ ఊబకాయం ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్..(fast food, junk food)

బిజీ జీవనశైలి కారణంగా చాలామంది పేలవమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నారు. సమయానికి ఏదో ఒకటి తింటే సరిపోతుంది అనుకోవడం తప్ప, ఆరోగ్యానికి ఏ ఆహారం తినాలి అనే ఆలోచన చేసేవారు చాలా తక్కువ ఉన్నారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలకు బదులుగా జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. వీటి వల్ల సమయం ఆదా అవుతోందని అనుకుంటారు కానీ ఆయుష్షు తగ్గిపోతోందనే విషయం అర్థం కావడం లేదు. ఈ ఆహారాల వల్ల గుండె మీద చాలా ప్రభావం పడుతుంది. ఇది గుండెపోటుకు కారణం అవుతుంది.

డిప్రెషన్..(depression)

చిన్న వయసులో గుండెపోటుకు గురయ్యోవారిలో డిప్రెషన్ ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్ మొత్తం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని, గుండె కొట్టుకునే తీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండెపోటుకు కారణం అవుతుంది.

Viral Video: వామ్మో.. ఇదేం పనయ్యా నాయనా..? చిన్న పిల్లాడిని బైక్‌పై వెనుకయినా కూర్చోబెట్టుకోకుండా ఇంత రిస్కేంటి..?


Updated Date - 2023-09-19T17:06:58+05:30 IST