Heart Touching Video: వారెవ్వా.. ఓ పెద్దాయనా.. నీకు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్.. రెండు చేతులూ లేని కుర్రాడు కొనేందుకు వస్తే..

ABN , First Publish Date - 2023-02-18T13:07:55+05:30 IST

కొందరి దగ్గర మంచిమనసే వారికి కోట్ల సంపద అంత గౌరవం

Heart Touching Video: వారెవ్వా.. ఓ పెద్దాయనా.. నీకు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్.. రెండు చేతులూ లేని కుర్రాడు కొనేందుకు వస్తే..

మానవత్వం, మంచి మనసు అనే వాటికి ధనిక పేద వర్గాలనే బేధం ఉండదు. కొందరి దగ్గర మంచిమనసే వారికి కోట్ల సంపద అంత గౌరవం తెచ్చిపెడుతుంది. మంచి మనసు ముందు డబ్బు కూడా ఓడిపోతుంది. ఓ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారి మనసులు ఆయన పట్ల గౌరవ భావంతో స్పందిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

వీధులలోనూ, రోడ్డు కూడళ్ళ దగ్గరా ఎంతోమంది పానీపూరి, భేల్ పూరి వంటివి అమ్ముతుంటారు. అలాగే ఓ పెద్దాయన భేల్ పూరి అమ్ముకుంటున్నాడు. ఆయన దగ్గరకు రెండు చేతులు లేని ఓ వికలాంక కుర్రాడు వచ్చాడు. భేల్ పూరి ఇవ్వమని అడిగాడు. ఆ అబ్బాయి కోసం ఆ పెద్దాయన భేల్ పూరి తయారుచేసి పొట్లం కట్టి ఆ అబ్బాయికి జాగ్రత్తగా ఇచ్చాడు. ఆ అబ్బాయి పెద్దాయనకు డబ్బులిస్తే ఆ డబ్బును తిరిగి ఆ కుర్రాడికి ఇచ్చేశాడు ఆయన. 'డబ్బు వద్దు బాబు.. నువ్వు సంతోషంగా ఉండు' అనే అర్థం వచ్చేలా ఆ పెద్దాయన రియాక్డ్ అయ్యాడు. ఈ వీడియోను Dr Vikas Kumar అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్(Twitter) లో పంచుకున్నారు. వీడియో చూసిన నెటిజన్లు చాలా ఎమోషన్ గా రియాక్డ్ అవుతున్నారు. డబ్బు ఉన్నవాడు కాదు గొప్పవాడు, మంచి మనసున్నవాడే గొప్పవాడని అర్థమైపోలేదూ..

Read also: వాషింగ్ మెషీన్‌లో పడిపోయిన ఏడాదిన్నర కొడుకు.. 15 నిమిషాల పాటు గుర్తించలేకపోయిన తల్లి.. ఆ పిల్లాడి పరిస్థితి ఏంటంటే..!


Updated Date - 2023-02-18T13:08:00+05:30 IST