High Cholesterol Signs: సైలెంట్ కిల్లర్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చెవుల వద్ద సంకేతాలు..!
ABN , First Publish Date - 2023-09-25T15:10:29+05:30 IST
రక్తంలో మైనంలాగా ఏర్పడి ఆరోగ్యకరమైన కణాల నిర్మాణాన్ని అదిక కొలెస్ట్రాల్ అడ్డుకుంటుంది. ముఖ్యంగా చెవుల వద్ద కనిపించే ఈ సంకేతాల వల్ల శరీరంలో అదిక కొలెస్ట్రాల్ ఉన్నట్టు గుర్తించవచ్చు.
చాలా ప్రమాదకరమైన వ్యాధులు దాదాపు చాప కింద నీరులా శరీరంలో చేరి ప్రాణాలను కబళిస్తుంటాయి. ఇవి ప్రాణం మీదకు వచ్చేవరకు అస్సలు బయటపడవు. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తుంటారు. ఈ సైలెంట్ కిల్లర్ జబ్బులలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. అధిక కొలెస్ట్రాల్ ను గమనించుకోకపోతే ఇది శరీరంలో చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రక్తంలో మైనంలాగా ఏర్పడి ఆరోగ్యకరమైన కణాల నిర్మాణాన్ని ఇది అడ్డుకుంటుంది. మరీ ముఖ్యంగా ధమనులలో రక్తప్రవాహాన్ని కష్టతరం చేస్తుంది. తద్వారా గుండె జబ్బుకు ప్రధాన కారణం అవుతుంది. చెవుల వద్ద కనిపించే కొన్ని సంకేతాల ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను గుర్తించవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే..
చాలావరకు అధిక కొలెస్ట్రాల్(high cholesterol) సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో వినికిడి సమస్య తలెత్తుతుంది. వినికిడి సమస్యలున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ శరీరంలో రక్తప్రవాహాన్ని ప్రభావితం చేసినప్పుడు లోపలి చెవికి ఆక్సిజన్ సరఫరాను సరిగా అందదు. ఇది చెవులకు సరైన పోషకాలు అందకుండా చేస్తుంది. దీని కారణంగా చెవిలోపలి కణాలు మొదట్లో కొద్దిగానూ, ఆ తరువాత శాశ్వతంగానూ దెబ్బతింటాయి. చెవి సమస్యకు, అధిక కొలెస్ట్రాల్ కు మధ్య సంబంధం గురించి జరిపిన ఒక అధ్యయనంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి 33శాతం ఎక్కువగా వినికిడి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.
Auto Driver: ఆటో డ్రైవర్‌ను చూసి అవాక్కవుతున్న ప్రయాణీకులు.. ఆటో ఎక్కిన అందరిదీ అదే పరిస్థితి.. అసలు కథేంటంటే..!
బరువు పెరగడం అధిక కొలెస్ట్రాల్ లో స్పష్టంగా కనిపించే ఒకే ఒక్క కారణం. ఊహించని విధంగా వినికిడి సమస్యలు వచ్చినట్టైతే వైద్యులను కలవాలి. బిస్కెట్లు, బేకరీ ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్ లు తీసుకోవడం ఆపేయాలి. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, కరిగే ఫైబర్, ప్రోటీన్, గుండెకు మేలు చేసే ఆహారాలు, కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.