Funny Video: వామ్మో.. ఏం క్రియేటివిటీ బాసూ.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కడుపుబ్బా నవ్వించాడుగా..!

ABN , First Publish Date - 2023-07-14T18:06:04+05:30 IST

మన మూడ్ బాగోలేని సమయంలో ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. ఎన్నో వందల వీడియోలు దర్శనమిస్తాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Funny Video: వామ్మో.. ఏం క్రియేటివిటీ బాసూ.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కడుపుబ్బా నవ్వించాడుగా..!

మన మూడ్ బాగోలేని సమయంలో ఒకసారి సోషల్ మీడియా (Social Media) ఓపెన్ చేస్తే చాలు. ఎన్నో వందల వీడియోలు దర్శనమిస్తాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తాయి (Funny Videos). మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.

viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి మెట్రో (Metro Train) రైలులో నిల్చుని ఫోన్ చూసుకుంటోంది. పక్కన ఓ యువకుడు సీటు (Seat) ఏమీ లేకపోయినా కూర్చున్నట్టు నటించాడు. కొద్ది సేపటి తర్వాత ఆ యువకుడు లేచి వెళ్లిపోయాడు. ఫోన్ చూడడంలో మునిగిపోయిన యువతి ఆ యువకుడు ఖాళీ చేసిన సీటులో కూర్చుందామనుకుని వెళ్లింది. అయితే అక్కడ సీటు ఏదీ కనిపించకపోవడంతో షాకైంది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral Video: మీ అన్ననే స్కూల్‌లో చేర్పిస్తా.. నీకు చదువు అక్కర్లేదన్న తండ్రి.. ఈ అఫ్గాన్ బాలిక సమాధానం వింటే..!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 66 వేల మంది లైక్ చేశారు. ఆ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఫన్నీ వీడియో``, ``బహిరంగ ప్రదేశాల్లో కూడా ఫోన్‌లో నిమగ్నమయ్యే వారిని భలే మోసం చెయ్యొచ్చు``, ``సూపర్ క్రియేటివిటీ బ్రదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-14T18:07:26+05:30 IST