Home Remedies For Loose Motion: ఎవరికీ చెప్పుకోలేని ‘విరేచనాల’ సమస్య.. ఈ 10 వంటింటి చిట్కాలను పాటిస్తే..!

ABN , First Publish Date - 2023-09-10T12:05:38+05:30 IST

తలనొప్పి, దగ్గు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలను ఎవరితో అయినా నిస్సంకోచంగా చెబుతుంటారు. కానీ విరేచనాలు అనే సమస్య బయటకు చెప్పాలంటే జంకుతారు. దీన్ని ఇంటివద్దే వీలైనంత తొందరగా తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

Home Remedies For Loose Motion: ఎవరికీ చెప్పుకోలేని ‘విరేచనాల’ సమస్య.. ఈ 10 వంటింటి చిట్కాలను పాటిస్తే..!

తలనొప్పి, దగ్గు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలను ఎవరితో అయినా నిస్సంకోచంగా చెబుతుంటారు. కానీ విరేచనాలు అనే సమస్య బయటకు చెప్పాలంటే జంకుతారు. కొందరితో విరేచనాలు అనే మాట చెబితే అదేదో కామెడీ అన్నట్టు నవ్వుతారు, మరికొందరు పైకి అయ్యో అన్నా లోపల మాత్రం తెగ నవ్వేసుకుంటారు. ఈ కారణాల వల్లనో ఏమో కానీ చాలామంది విరేచనాలు అనే సమస్యను బయటకే చెప్పరు. ఇక ఈ విరేచనాలలో కూడా లూజ్ మోషన్స్ మరింత ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి మనిషి ప్రమేయం లేకుండానే బట్టల్లోనే మోషన్ జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. ఈ లూజ్ మోషన్స్ సమస్యను వైద్య పరంగా అతిసారం అని, డయేరియా(diarrhea) అని అంటారు. ఈ సమస్య మనిషిలో శక్తిని చాలా తొందరగా లాగేస్తుంది. ఇది శరీరంలో నీటి శాతం కోల్పోయేలా చేసి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బాలెన్స్ చెడిపోవడానికి కారణం అవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. ఇంట్లోనే 10చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా మోషన్ సమస్యను అరికట్టవచ్చు..

లూజ్ మోషన్స్ తో ఇబ్బంది పడేవారిలో మలం చాలా పలుచగా ఉంటుంది, మలంలో రక్తం పడటం, వికారం, కడుపులో తిమ్మిరి, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, బరువు తగ్గడం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లూజ్ మోషన్స్ సమస్యను నివారించడానికి ప్రతి ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉండే నిమ్మరసం బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ(Lemon)లో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగులకు చక్కగా చికిత్స చేస్తుంది. శరీరం కోల్పోయిన PH బ్యాలెన్స్ ను తిరిగి అందిస్తుంది. నిమ్మరసంలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఉప్పుతో కలిసి జ్యూస్ తయారు చేసి తీసుకుంటే లూజ్ మోషన్స్ సమస్య తగ్గుతుంది.

వంటింట్లో ఔషద గుణాలు కలిగిన మరొక పదార్థం అల్లం(ginger). అల్లానికి కడుపు కండరాలకు ఉపశమనం కలిగించే శక్తి ఉంది. జీర్ణక్రియతో సహా అనే వ్యాధులకు ఉపశమనం కలిగించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. కాసింత అల్లం బుగ్గన పెట్టుకుని మెల్లిగా నములుతూ ఆ రసాన్ని మింగవచ్చు. లేదా అల్లంతో టీ తయారుచేయించుకుని తాగవచ్చు. అల్లం రసం కూడా తీసుకోవచ్చు.

Wife-Husband: భర్తతో పొరపాటున కూడా భార్య అనకూడని మాటలివీ.. సరదాకయినా ఈ కామెంట్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!



పెరుగు(curd)లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థలో ఉన్న ఇబ్బందిని పెరుగు తొలగిస్తుంది. అతిసారం కలిగించే బ్యాక్టీరియాకు పెరుగు చెక్ పెడుతుంది. అంతేకాదు మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నా పెరుగు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.

లూజ్ మోషన్స్ ద్వారా శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోయే పొటాషియం, ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేయడంలో అరటిపండు(banana) బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలం పలుచగా వెళ్లడాన్ని అరికడుతుంది.

చాలామందికి తెలియని టీ చామంతి పూల టీ. దీన్ని చమోమిలే టీ(chamomile tea) అని అంటారు. ఇది గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. అజీర్ణం, గ్యాస్, వికారం, వాంతులు, విరేచనాలు మొదలైన సమస్యలున్నప్పుడు చమోమిలే టీ బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీస్పాస్మోడిక్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పని తగ్గించడంలో సహాయపడతాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా జీలకర్ర నీరు(cumin water), దానిమ్మరసం(Pomegranate), పసుపునీరు(turmeric water), సోపు(saunf or fennel seeds), తేనె(honey), పుదీనా(mint) కూడా లూజ్ మోషన్స్ సమస్యను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.

Health Tips: పాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ ఆహారాలతో కలిపి తీసుకుంటే అంతే సంగతులు..


Updated Date - 2023-09-10T12:05:38+05:30 IST