Horoscope Today: ఈ రాశి వాళ్లు పెట్టిన పెట్టుబడికి ఇవాళ లాభం చూస్తారు..!
ABN , First Publish Date - 2023-04-18T12:59:00+05:30 IST
పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో..
రాశిఫలాలు (పుట్టిన తేదీ ప్రకారం)
18-4-2023 - మంగళవారం
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. చొరవ, నైపుణ్యం, భిన్నమైన ఆలోచనలతో పనులు పూర్తి చేయగలుగుతారు. లక్ష్య సాధనకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఉన్నత పదవులు అందుకుంటారు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్ట్ పనులకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. రవాణా, బోధన, పోలీస్, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్‌లో పెట్టుబడులకు అనుకూలం. పెన్షన్, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కేటరింగ్, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిబ్బంది నియామకాలకు అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్, సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. రవాణా, స్టేషనరీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఫైనాన్స్, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనుల కోసం ఖర్చు చేస్తారు. బంగారం, ఆభరణాలు, వడ్డీ వ్యాపారులకు అనుకూలం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ