Share News

Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీళ్లను తాగుతున్నారా..? అదే పనిగా తాగితే ఏం జరుగుతుందంటే..!

ABN , First Publish Date - 2023-11-21T10:30:41+05:30 IST

ఆరోగ్యానికి వేడినీరు మంచిదే అని చెప్పే వైద్యశాస్త్రం కూడా అతిగా వేడినీరు తాగితే జరిగేదేంటో చెబుతోంది.

Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీళ్లను తాగుతున్నారా..? అదే పనిగా తాగితే ఏం జరుగుతుందంటే..!

వేడినీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అనారోగ్యం చేసినప్పుడు, పరగడుపున వేడినీరు తాగడం వల్ల శరీరం శుద్ది అవుతుంది శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళతాయి. జీర్ణాశయ మార్గం క్లియర్ అవుతుంది. అధికబరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. సాధారణ నీటి కంటే వేడి నీరు తొందరగా జీర్ణమవుతాయి కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా వేడినీటి వల్ల బోలెడు లాభాలున్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నారు. ఆరోగ్యానికి వేడినీరు మంచిదే అని చెప్పే వైద్యశాస్త్రం కూడా అతిగా వేడినీరు తాగితే నష్టమే అంటోంది. ఆరోగ్య ప్రయోజనాలుంటాయనే కారణంతో వేడినీటిని అదే పనిగా తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

వేడినీటిని ఉదయాన్నే తాగడం(drinking hot water) వల్ల పెదవులకు నష్టం కలుగుతుంది. ఉదయాన్నే పెదవులకు వేడి తగలడం వల్ల పెదవులు పొడిబారతాయి. కొన్నిసార్లు పెదవులు పగిలిపోయి నిర్జీవంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. వేడినీరు తాగాలని అనుకునేవారు గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.

ఇది కూడా చదవండి: ఇళ్లల్లో మనీ ప్లాంట్‌ పెంపకం.. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే..!


పదేపదే వేడినీరు తాగేవారు నిద్ర సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. వేడినీరు నిద్రకు భంగం కలిగిస్తుంది. వేడినీరు తొంందరగా జీర్ణం అవుతుంది. పడుకునేముందు వేడినీరు తాగితే పదే పదే బాత్రూమ్ కు వెళ్లే సమస్య ఎదురవతుంది.

ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తాగినా, వేడి నీరు ఎక్కువగా తీసుకుంటున్నా కిడ్నీలకు ముప్పే. మూత్రపిండాలు విషపదార్థాలను ఫిల్టర్ చేస్తారనే విషయం తెలిసిందే. దీని వల్ల కిడ్నీలు పాడవుతాయి.

వేడినీరు నోటి పుండ్లకు కారణం అవుతుంది. అదే పనిగా రోజంతా వేడినీరు తాగుతుంటే నోటిలో చర్మం సున్నితంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా కాస్త వేడిగా ఉన్న ఆహారాలు, ఇతర వేడి ద్రవాలు తాగేటప్పుడు ఈ సమస్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు..

Updated Date - 2023-11-21T10:30:43+05:30 IST