Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌లో ఇంకెంత గ్యాస్ ఉంది..? రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక్క నిమిషంలో ఇలా కనిపెట్టొచ్చు..!
ABN , First Publish Date - 2023-06-15T12:09:07+05:30 IST
మన ఇళ్లలో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ఒక్కోసారి సడన్‌గా అయిపోతూ ఉంటుంది.
Gas Cylinder: మన ఇళ్లలో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ఒక్కోసారి సడన్‌గా అయిపోతూ ఉంటుంది. దాంతో వంట చేస్తూండగా మధ్యలోనే ఆగిపోతుంది. అలాంటి సమయాల్లో గృహిణులు ఆందోళన చెందుతూ ఉంటారు. డబుల్ సిలిండర్ ఉంటే పర్లేదు. కానీ, అదనంగా ఇంకో గ్యాస్ సిలిండర్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా ఉన్నపళంగా గ్యాస్ అయిపోతే పాట్లు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు గ్యాస్ ఎంత ఉందో ముందుగానే ఎలా తెలుస్తుంది? మన గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకునేందుకు చిన్న టెక్నిక్ ఉంది. రూపాయి కూడా ఖర్చు లేకుండానే సింపుల్ ట్రిక్‌తో గ్యాస్ సిలిండర్‌లో ఇంకా గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
గృహ వినియోగాల కోసం వాడే గ్యాస్ సిలిండర్‌లో సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. ఇక కొన్ని రోజుల వాడిన తర్వాత వంట చేస్తుండగా ఎప్పుడు అయిపోతుందో అనే టెన్షన్ ఉంటుంది. అయితే, మనం గ్యాస్ సిలిండర్ వాడుతున్నప్పుడే అందులో ఇంకెంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి సిలిండర్ మీద గొరువెచ్చని నీళ్లు వేయాలి. ఆ తర్వాత దానిపై చేతితో తాకి చూడాలి. గ్యాస్ ఉన్నంతవరకు టెంపరేచర్ అనేది ఒకరంగాను, ఖాళీగా ఉన్న చోటు మరో రకంగా ఉంటుంది. గ్యాస్ ఎంత వరకు ఉంటుందో అంత వరకు చల్లగా ఉంటుంది. గ్యాస్ లేని దగ్గర మాత్రం ఆ చల్లటి ఫీలింగ్ ఉండదు.
Woman: బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు బయటకొచ్చిన దూది ఉండలు.. భయంతో ఆస్పత్రికి వెళ్తే వెలుగులోకి అసలు నిజం..!
ఇలా మనం ఈ చిన్న టెక్నిక్ ద్వారా సిలిండర్‌లో గ్యాస్ ఇంకా ఎంత ఉందో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దీనిని బట్టి గ్యాస్ ఇంకెంత కాలం వస్తుందో సులువుగా అంచనా వేసుకోవచ్చు. దీంతో పాటు పరికరం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలుసుకునే మ్యాగ్నెటిక్ గ్యాస్ లెవల్ ఇండికేటర్ (Magnetic Gas Level Indicators) కూడా అందుబాటులో ఉంది. దానిని సిలిండర్‌కు తగిలిస్తే పూర్తిగా గ్యాస్ ఎంతుందో పరికరం మీటర్‌లో చూపిస్తుంది. అలాగే గ్యాస్ పోయి వెలిగించేటప్పుడు మంటను బట్టి కూడా గ్యాస్ ఎంత ఉందో చెప్పొచ్చు. సాధారణంగా గ్యాస్ ఫ్లేమ్ అనేది నీలం రంగులో ఉంటుంది. కానీ సిలిండర్‌లో గ్యాస్ దగ్గర పడినప్పుడు అది పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. గ్యాస్ ఫ్లేమ్ కలర్ ఎరుపు రంగులో రాగానే మీరు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి టెక్నిక్‌లతో గ్యాస్ అయిపోకుండానే ముందుగానే జాగ్రత్త పడొచ్చు.