తడి టవల్ ఆరకుండా పదేపదే వాడుతున్నారా?.. అయితే ఈ ముప్పు తప్పదు.. ఎన్ని రోజులకు దానిని ఉతకాలంటే..
ABN , First Publish Date - 2023-04-01T11:27:03+05:30 IST
మనం నిత్యం వినియోగించే టవల్(towel)ను ఎన్ని రోజులకు ఉతకాలి అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మన మదిలో మెదిలేవుంటుంది.
మనం నిత్యం వినియోగించే టవల్(towel)ను ఎన్ని రోజులకు ఉతకాలి అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మన మదిలో మెదిలేవుంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం మన శరీరాన్ని తుడుచుకునే టవల్స్‌కు బ్యాక్టీరియా(Bacteria) అంటుకుంటుంది.
ఆ తరువాత టవల్స్‌లో ఉండే తేమ కారణంగా, సూక్ష్మక్రిములు(Germs) వృద్ధి చెందడానికి అనుకూలంగా మారుతుంది. అటువంటి స్థితిలో, టవల్‌ను ఆరబెట్టకుండా పదే పదే ఉపయోగిస్తే, దానిపై పేరుకున్న బ్యాక్టీరియా మీ చర్మం, ముక్కు ద్వారా మీ శరీరంలోనికి చేరుకుంటుంది. అది మిమ్మల్ని అనారోగ్యానికి(illness) గురి చేస్తుంది. నిపుణుల అభిప్రాయం(Expert opinion) ప్రకారం మీరు కనీసం మూడు సార్లు ఉపయోగించన తరువాత టవల్‌ను ఉతికి, ఆరబెట్టాలి. అంటే మీరు రోజుకు ఒకసారి స్నానం(bath) చేస్తే, మూడు రోజులు ఉపయోగించిన తర్వాత టవల్స్ ఉతకాలి.
మనం బయటకు వెళ్లినప్పుడు, బ్యాక్టీరియా, ఫంగల్ లేదా వైరస్(Virus) మన చేతులతో సహా శరీరంలోని వివిధ భాగాలకు చేరుకుంటుంది. అప్పుడు ఇంటికి వచ్చాక ఆ టవల్‌తో తుడుచుకుంటే మన చర్మంపై ఉండే బ్యాక్టీరియా తిరిగి టవల్‌కు అంటుకుంటుంది.
ఉతకకుండా మురికి(dirty) పట్టిన టవల్స్‌ను పదే పదే ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులు(Skin diseases) వస్తాయి. ఇది మాత్రమే కాదు మురికి టవల్‌ను ఉపయోగించడం వల్ల తామర, దద్దుర్లు వంటి తీవ్రమైన చర్మ వ్యాధుల బారిన పడవచ్చు. మొత్తంగా చూస్తే వారానికి రెండుసార్లు(Twice) తప్పనిసరిగా టవల్‌ను ఉతకాలి.