Aadhaar Card Rules: ఆధార్‌ కార్డుపై వీటిని మార్చేందుకు ఒక్కసారే ఛాన్స్.. పేరు, పుట్టిన తేదీ, ఫొటోలను ఎన్నిసార్లు మార్చొచ్చంటే..!

ABN , First Publish Date - 2023-05-16T17:02:49+05:30 IST

ఆధార్ కార్డు విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. కాలేజీలో చేరాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా.. ఇలా ఒక్కటేంటి? అన్నింటికీ ఆధారే ఆధారంగా మారింది. అలాంటి ఆధార్ కార్డులో

Aadhaar Card Rules: ఆధార్‌ కార్డుపై వీటిని మార్చేందుకు ఒక్కసారే ఛాన్స్.. పేరు, పుట్టిన తేదీ, ఫొటోలను ఎన్నిసార్లు మార్చొచ్చంటే..!
Aadhaar Card Rules

ఆధార్ కార్డు విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. కాలేజీలో చేరాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా.. ఇలా ఒక్కటేంటి? అన్నింటికీ ఆధారే ఆధారంగా మారింది. అలాంటి ఆధార్ కార్డులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మాటిమాటికీ సవరణలు చేసుకోవడం కుదురుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

2019లో యూఐడీఏఐ (UIDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది (Aadhaar Card Rules). ఆధార్‌ కార్డుపై ఉండే వివరాలను సవరించడంపై పరిమితి విధించింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను పరిమిత సంఖ్యలో మాత్రమే మార్చడానికి వీలు కల్పించింది.

పేరు: యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డుపై పేరును (name) రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది.

పుట్టిన తేదీ: ఇక పుట్టిన తేదీని (birth) ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యూఐడీఏఐ అనుమతిస్తోంది. అదీ ఆధార్‌ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి మూడు సంవత్సరాలు అటూ ఇటూ మాత్రమే మార్చాలి. ఆధార్‌ నమోదు సమయంలో పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి పత్రాలు రుజువుగా సమర్పించనట్లయితే.. దాన్ని ‘డిక్లేర్డ్‌’ లేదా ‘అప్రాగ్జిమేట్‌’గా పేర్కొంటారు. తర్వాత ఎప్పుడైనా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ఒక ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది.

జెండర్‌: ఆధార్‌ కార్డులో జెండర్‌ (gender) వివరాలు కేవలం ఒకసారి మాత్రమే మార్చడానికి వీలుంటుంది.

ఫొటో: ఆధార్‌ కార్డ్‌పై ఉండే ఫొటోను (photo) సవరించుకోవడంపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. దగ్గర‌లో ఉన్న ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి ఫొటోను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మార్చడం కుదరదు.

చిరునామా: అడ్రస్‌ను మార్చుకోవడంపై కూడా యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. చిరునామాను ధ్రువీకరిస్తూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలను పరిమితికి మించి మార్చడానికి వీలు కుదరదు. ఒకవేళ పరిమితి దాటిన తర్వాత మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డ్‌ హోల్డర్‌ దగ్గరలోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాలి. పరిమితి మంచి సవరణలు చేస్తున్న నేపథ్యంలో అప్‌డేట్‌ను స్వీకరించమని ప్రత్యేకంగా మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా వివరించాలి. దీనికి ఆధార్‌ వివరాలు, సంబంధిత పత్రాలు, యూఆర్‌ఎన్‌ స్లిప్‌ను జత చేయాలి. help@uidai.gov.in మెయిల్‌ ఐడీకి మెయిల్‌ పంపాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కోరితే తప్ప ప్రాంతీయ ఆధార్‌ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం లేదు. సంబంధిత అధికారులు విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి మార్పు సమంజసమేనని భావిస్తే.. అందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు అనుమతి ఇస్తారు. ఈ మేరకు చేయాల్సిన మార్పులకు సంబంధించిన వివరాలను టెక్నికల్‌ విభాగానికి పంపిస్తారు. కొన్ని రోజుల్లోనే మారిన వివరాలతో కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది.

ఇది కూడా చదవండి: Viral Video: తరగతి గదిలోనే విద్యార్థులతో ఇలాంటి డాన్సులేంటి..? ఓ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్..!

ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అవతలి వాళ్లు పంపిన మెసేజ్‌కు బదులుగా ఎందుకిలా వస్తుందంటే..

Updated Date - 2023-05-16T17:02:49+05:30 IST