మనిషి శరీరం నుంచి వెలువడే ఆ ద్రవంతో ఒక స్విమ్మింగ్ పూల్ నింపొంచ్చు... అది కన్నీరా? లాలాజలమా?... సమాధానమేమంటే..

ABN , First Publish Date - 2023-04-12T11:36:49+05:30 IST

మనిషికి నోటిలో నిత్యం లాలాజలం(Saliva) ఊరుతుంటుంది. అయితే మనిషి తన మొత్తం జీవితంలో ఎంత లాలాజలం ఉత్పత్తి చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Laledentists వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి నిమిషానికి సగటున 0.5 ml లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు.

మనిషి శరీరం నుంచి వెలువడే ఆ ద్రవంతో ఒక స్విమ్మింగ్ పూల్ నింపొంచ్చు... అది కన్నీరా? లాలాజలమా?... సమాధానమేమంటే..

మనిషికి నోటిలో నిత్యం లాలాజలం(Saliva) ఊరుతుంటుంది. అయితే మనిషి తన మొత్తం జీవితంలో ఎంత లాలాజలం ఉత్పత్తి చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Laledentists వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి నిమిషానికి సగటున 0.5 ml లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు. అంటే ఒక ఒక రోజులో(one day) 720 ml లాలాజలం ఉత్పత్తి చేస్తాడన్నమాట. దానిని సంవత్సరం(year) అంటే 360 రోజులకు చూసుకుంటే అది 262.8 లీటర్లకు సమానం. సగటు మనిషి జీవిత కాలం(life span) 80 సంవత్సరాలు. దీని ప్రకారం మనషి తన మొత్తం జీవితకాలంలో సుమారు 21,024 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడని చెప్పుకోవచ్చు.

ఇది ఒక ఒక చిన్న స్విమ్మింగ్ పూల్‌(Small swimming pool)ను నింపేంత ఉంటుందని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కాగా లాలాజలం ఉత్పత్తికి అనేక కారణాలు ఉన్నాయి. లాలాజలం దంతాలకు(teeth) ఎంతో మేలు చేస్తుంది. ఇది నోటిని తేమగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఇది నమలడానికి, రుచి చూడటానికి, మింగడానికి(swallow) ఎంతగానో సహాయపడుతుంది. దంతాల మీద చిక్కుకున్న ఆహారపు కణాలు లాలాజలం(Saliva)తో తొలగిపోతాయి. లాలాజలం నోటిలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

Updated Date - 2023-04-12T12:31:20+05:30 IST