Wife-Husband: భార్య దగ్గర సీక్రెట్ ఫోన్.. చాటుగా ఎవరితో మాట్లాడుతోందో తెలిసి భర్తకు షాక్.. చివరకు ఊహించని సీన్..!
ABN , First Publish Date - 2023-10-30T18:23:15+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 27వ తేదీన ఓ వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీర్జాపూర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 27వ తేదీన ఓ వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. తనకు దిక్కేది అంటూ ఏడ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో బయటపడిన విషయం పోలీసులకే షాక్ కలిగించింది (Crime News).
మిర్జాపూర్ (Mirzapur) జిల్లా జర్హా గ్రామానికి చెందిన అనుజ్ కుమార్ (30) అనే వ్యక్తి మృతదేహం ఈ నెల 27న రోడ్డు పక్కన పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అనుజ్ తన భార్య మమతా సింగ్‌తో కలిసి భోపాల్‌లో నివాసం ఉంటున్నాడు. మమత వివాహానికి ముందే జై ప్రకాష్ అనే వ్యక్తితో ప్రేమాయణం (Love Affiar) సాగించింది. అనుజ్‌తో వివాహం తర్వాత కూడా ప్రకాష్‌తో సంబంధం కొనసాగించింది. చాలా రోజులు భర్తకు తెలియకుండా వ్యవహారం సాగించింది.
Ratan Tata: ఉన్నట్టుండి రతన్ టాటా ఇలాంటి ట్వీట్ చేశారేంటి..? అసలు నాకేం సంబంధం లేదంటూ..!
చివరకు ఒక రోజు తన భార్య దగ్గర ఫోన్ ఉన్నట్టు అనుజ్ తెలుసుకున్నాడు. జాగ్రత్తగా గమనించి మమత గంటల తరబడి ప్రకాష్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్‌ను తీసుకుని అత్తమామల దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో మమత, ప్రకాష్.. అనుజ్‌పై పగ పెంచుకున్నారు. అనుజ్‌ను అడ్డు తప్పించాలని నిర్ణయించుకున్నారు. మరో ఇద్దరి సహాయం తీసుకుని ఆ నెల 26వ తేదీ రాత్రి బైక్‌పై వెళ్తున్న అనుజ్‌ను అడ్డగించి గొడ్డలితో నరికి చంపేశారు (Wife killed Husband). అనంతరం మమత ఏమీ తెలియనట్టు భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. అయితే విచారణలో అసలు విషయం బయటపడడంతో మమత, ప్రకాష్, సహకరించిన ఇద్దరు నిందితులు జైలు పాలయ్యారు.