Hyderabad vs Bangalore: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా.. ప్రతి నెలా రూ.40 వేలు సేఫ్.. నెట్టింట రచ్చ లేపిన ఓ టెకీ పోస్ట్..!

ABN , First Publish Date - 2023-09-06T12:51:31+05:30 IST

బెంగుళూరులో ఉద్యోగం చేసిన ఓ సాఫ్వేర్ ఇంజనీర్ ఉద్యోగపరంగా తన మకాం హైదరాబాద్ కు మార్చాడు. ఆ తరువాత అతను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట్ల హాట్ టాపిక్ గా మారాయి.

Hyderabad vs Bangalore: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చేశా.. ప్రతి నెలా రూ.40 వేలు సేఫ్.. నెట్టింట రచ్చ లేపిన ఓ టెకీ పోస్ట్..!

హైదరాబాద్, బెంగుళూరు రెండూ మెట్రో నగరాలే. ఈ రెండు నగరాల్లో సాఫ్ట్ వేర్ నుండి చాయ్ కొట్టు వరకు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అన్నిరోజులు బెంగుళూరులో ఉద్యోగం చేసిన ఓ సాఫ్వేర్ ఇంజనీర్ ఉద్యోగపరంగా తన మకాం హైదరాబాద్ కు మార్చాడు. ఆ తరువాత అతను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట్ల హాట్ టాపిక్ గా మారాయి. 'నేను బెంగుళూరు నుండి హైదరాబాద్ కు వచ్చేశాను, ప్రతి నెలా రూ. 40వేలు మిగులుతోంది' అంటూ అతను చేసిన కామెంట్స్ కాస్తా పెద్ద చర్చకే దారితీశాయి. అసలు అతను చెబుతున్నట్టు నిజంగానే హైదరాబాద్ లో ఖర్చు తక్కువగా ఉంటుందా? బెంగుళూరులో జీవనం ఖరీదు ఎందుకు? అని ఒకటే ప్రశ్నలు, జవాబులతో సోషల్ మీడియా ఉడికిపోతోంది. దీనిగురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bengaluru) రెండూ మెట్రో నగరాలే అయినా సాంకేతికత, పట్టణీకరణతో పోలిస్తే బెంగుళూరు జీవనం ఖరీదుగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బెంగుళూరులో ఇంటి అద్దెల గురించి వచ్చిన వార్తలు మరే నగరం గురించి రాలేదంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా అక్కడ లోకల్ ప్రయాణ ఖర్చుల నుండి ప్రతి ఒక్కటీ హైదరాబాద్ తో పోలిస్తే ఎక్కువే. దీనిగురించే చెబుతూ పృధ్వీ రెడ్డీ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'బెంగుళూరు నుండి హైదరాబాద్ కు వచ్చేశాను, ప్రతి నెలా 40వేలు సేవ్ అవుతున్నాయి. ఈ 40వేలతో ఓ కుటుంబం ప్రశాంతంగా బ్రతకచ్చు' అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేపారు. ' మీకు 40వేలు ఎలా మిగులుతున్నాయి? కేవలం ఇంటి అద్దె వల్ల మిగులుతున్నాయా?' అని ఒకరు ప్రశ్నించాడు. దీనికి అతను సమాధానం ఇస్తూ 'ఇంటి అద్దె, మైంటెన్స్ ఖర్చులు, నీరు, విద్యుత్ బిల్లు, ఆహారం ఇలా అన్నింటి మీద కలిపి 40వేలు ఆదా అవుతున్నాయి' అని సమాధానం ఇచ్చాడు.

Accident Video: కుక్కను కాపాడాలని బ్రేక్ వేసింది కానీ.. మరుక్షణంలోనే షాకింగ్ సీన్.. కారుపై ఏదో పడ్డట్టు అనిపించి బయటకు వచ్చి చూస్తే..!



ఈ విషయాన్ని Prudhvi Reddy తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ఇతని అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'నాది కూడా సరిగ్గా ఇదే అనుభవం బ్రో.. నేను మీరు చెప్పిన విషయంతో ఏకీభవిస్తాను'అని ఒకరు కామెంట్ చేశారు. 'ఒంటరిగా ఉంటే పట్టించుకునేవారు ఎవరూ ఉండరు.చాలా సమయం వృధా అవుతుంది. దాన్ని మినహాయిస్తే ఈ విషయం గురించి అంత బాధపడాల్సిన పని ఉండదు'అని మరొకరు కామెంట్ చేశారు. 'మీరు బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉంటారు? హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో ఉంటున్నారు? నివసించే ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా.. మెట్రో పాస్ లు చాలా తక్కువ ఖర్చులో ఉంటాయి. అయినా హైదరాబాద్ లో ఇంటి అద్దె తక్కువ అనేది పాత విషయం' అని మరొకరు కామెంట్ చేశారు. ఈ డిబేట్స్ ఎక్కువ అవడంతో సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్విట్టర్ లోనే తన అభిప్రాయం ఏంటనేది వివరంగా చెప్పాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను ఉద్యోగపరంగా బెెంగుళూరులో ఉండటం వల్ల అంత ఖర్చు అయ్యేదని, దానికితోడు బెెంగుళూరులో కృత్రిమంగా పనిచేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేదని చెప్పాడ., హైదరాబాద్ వచ్చాక ఆ పరిస్థితి మారిందని చెప్పుకొచ్చాడు. తన ఉద్దేశం రెండు ప్రాంతాలను పోల్చి చూడటం కాదని వివరణ ఇచ్చుకున్నాడు.

Viral Video: పాపం.. ఈ పిల్లాడు ఎంత ఫీలయ్యాడో.. టీచర్స్ డే కదా అని మస్తు సెలబ్రేషన్స్ చేస్తోంటే.. తరగతి గదిలోనే..!


Updated Date - 2023-09-06T12:51:31+05:30 IST