Viral News: బాబోయ్.. ఇంత డబ్బు ఏం చేసుకోవాలి..? రూ.14 వేల విమాన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. రీఫండ్ ఎంతొచ్చిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-12T20:07:19+05:30 IST

సాధారణంగా రైలు లేదా విమాన ప్రయాణాల కోసం చాలా మందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అనుకున్న సమయానికి ప్రయాణం కుదరకపోతే ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. అలా క్యాన్సిల్ చేసుకున్నందుకు కొంత ఛార్జీ పోగా మిగిలిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.

Viral News: బాబోయ్.. ఇంత డబ్బు ఏం చేసుకోవాలి..? రూ.14 వేల విమాన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. రీఫండ్ ఎంతొచ్చిందో చూస్తే..!

సాధారణంగా రైలు లేదా విమాన ప్రయాణాల (Flight Journey) కోసం చాలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అనుకున్న సమయానికి ప్రయాణం కుదరకపోతే ఆ టికెట్లను క్యాన్సిల్ (Ticket Cancellation) చేసుకుంటారు. అలా క్యాన్సిల్ చేసుకున్నందుకు కొంత ఛార్జీ పోగా మిగిలిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అయితే ఆ టికెట్లను ఎప్పుడు క్యాన్సిల్ చేశాం అనే దాని మీద రిఫండ్ (Refund) ఎంత వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. తాజాగా ఓ ఐయేఎస్ ఆఫీసర్ రూ.13,820 విలువైన టికెట్‌ను క్యాన్సిల్ చేశారు. అతనికి వెనక్కి ఎంత వచ్చిందో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.

బీహార్ (Bihar) కేడర్‌కు చెందిన ఐఏఎస్ రాహుల్ కుమార్ ట్విటర్‌లో టికెట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను షేర్ చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. ఎయిర్‌లైన్ టికెట్ కోసం రూ.13,820 చెల్లించారు. అయితే ఆయన ఈ టికెట్ క్యాన్సిల్ చేస్తే కేవలం రూ.20 మాత్రమే రీఫండ్ (Rs. 20 refund) వచ్చింది. ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ ఫీజ్ రూ.11,800, జీఐ క్యాన్సలేషన్ ఫీజ్ రూ.1,200, జీఐ కన్వీనెన్స్ ఫీజు రూ.800 మినహాయించగా ఆయనకు కేవలం రూ.20 రీఫండ్ వచ్చింది. షాకైన ఆయన వెంటనే ట్విటర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.

Amazon: రూ.50 వేల ఖరీదైన యాపిల్‌ వాచ్‌ను అమెజాన్‌లో ఆర్డర్ ఇస్తే.. ఈ మహిళకు ఏం డెలివరీ చేశారో చూస్తే..!

తనకు వచ్చిన రీఫండ్‌కు మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉంటే చెప్పండి అంటూ రాహుల్ కుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన ట్వీట్‌ను 5 లక్షల మందికి పైగా చూశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఆ రిఫండ్‌తో ఒక యస్ బ్యాంక్ షేరు కొనండి``, ``ఎవరికైనా డొనేట్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేయండి`` అంటూ నెటిజన్లు ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారు.

Updated Date - 2023-07-12T20:07:19+05:30 IST