IAS officer: ఆ మహిళా ఐఏఎస్ అధికారి తన పేరు మార్చుకున్నారుగా.. విషయం ఏంటంటే...
ABN , First Publish Date - 2023-12-13T12:11:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి బీలా రాజేష్(Beela Rajesh) తన పేరు మార్చుకున్నారు. కరోనా లాక్డౌన్ రోజుల్లో
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి బీలా రాజేష్(Beela Rajesh) తన పేరు మార్చుకున్నారు. కరోనా లాక్డౌన్ రోజుల్లో ఆమె ఆరోగ్యశాఖ కార్యదర్శిగా వ్యవహరించి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రస్తుతం ఇంధన శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త, మాజీ ప్రత్యేక డీజీపీ రాజేష్దాస్ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రప్రభుత్వం ఆయనకు నిర్భంద పదవీ విరమణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, డాక్టర్ బీలా రాజేష్ అనే పేరును డాక్టర్ బీలా వెంకటేశన్(Dr. Beela Venkatesan)గా మార్చుకున్నారు. తన పేరులో ఉన్న భర్త పేరు తొలగించి తన తండ్రి, మాజీ డీజీపీ పేరును మహిళా ఐఏఎస్ అధికారి చేర్చుకోవడం గమనార్హం.