Share News

Viral Video: ఈ సమోసా చేసన వ్యక్తికి గరుడ పురాణంలో శిక్ష ఉంటుంది.. చాక్లెట్ ఐస్‌క్రీమ్ సమోసాపై నెటిజన్ల ఘాటు కామెంట్లు..

ABN , First Publish Date - 2023-10-22T16:41:25+05:30 IST

రకరకాల ఆహార పదార్థాలు తినాలనుకునే ఆహార ప్రియులు విచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. వాటిల్లో కొన్ని బాగా క్లిక్ అయి ఆహార ప్రియులను అలరిస్తాయి. మరికొన్ని దారుణమైన రుచిని అందిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి అలాంటి రకరకాల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఈ సమోసా చేసన వ్యక్తికి గరుడ పురాణంలో శిక్ష ఉంటుంది.. చాక్లెట్ ఐస్‌క్రీమ్ సమోసాపై నెటిజన్ల ఘాటు కామెంట్లు..

రకరకాల ఆహార పదార్థాలు తినాలనుకునే ఆహార ప్రియులు విచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. వాటిల్లో కొన్ని బాగా క్లిక్ అయి ఆహార ప్రియులను అలరిస్తాయి. మరికొన్ని దారుణమైన రుచిని (Taste) అందిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి అలాంటి రకరకాల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ (Viral Video)అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఐస్‌క్రీమ్ సమోసా (Ice cream Samosa) చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియో (Shocking Video) చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

foodie_tshr అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి సమోసాను (Samosa) మధ్యలోకి కట్ చేసి ప్లేట్‌లో ఉంచాడు. ఆ సమోసా మధ్యలో ఉన్న ఆలూ కూర కాదు.. చాక్లెట్ కేక్. ప్లేట్‌లో ఉన్న ఆ రెండు సమోసా ముక్కలపై వెనీలా ఐస్‌క్రీమ్‌ (Ice cream) వేశాడు. ఆ తర్వాత రెండు భాగాలపై చాక్లెట్ సిరప్ వేశాడు. అయితే, సమోసా లోపల నింపినది బంగాళాదుంప కాదు, చాక్లెట్ కేక్. ఈ వింత వంటకాన్ని చూసి జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు (Food Videos).

Shocking: ఇది అందమైన ప్రకృతి దృశ్యం కాదు.. ప్రపంచం అంతమైపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ సాధించింది. 24 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ``ఈ సమోసా తినాలంటే దేవుడు దిగి రావాలి``, ``బ్రదర్.. మీరు ఈ సమోసాపై ఫినైల్ వేయడం మర్చిపోయారు``, ``ఇది చాలా పెద్ద నేరం``, ``గరుడ పురాణంలో దీనికి ప్రత్యేక శిక్ష ఉంది``, `` ఇది చేసిన వాడు నేరుగా నరకానికి వెళతాడు``, 'ఇది మొత్తం మూడ్‌ని పాడు చేసింది`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-22T16:41:25+05:30 IST