College Girl: కాలేజీకి వెళ్లిన కూతురు తిరిగి రాలేదేంటని తల్లిదండ్రుల్లో టెన్షన్.. సాయంత్రం 6 గంటలకు మోగిన తండ్రి ఫోన్.. లిఫ్ట్ చేస్తే..!
ABN , First Publish Date - 2023-09-20T14:11:23+05:30 IST
ఆ వ్యక్తి వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు.. అతడి కూతురు స్థానిక కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.. సోమవారం ఉదయం ఎప్పటిలాగానే కూతురిని తండ్రి కాలేజీకి డ్రాప్ చేశాడు.. సాయంత్రం ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదు.. ఎంతగా వెతికినా ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు.. తల్లిదండ్రులు టెన్షన్ పడుతుండగా..
ఆ వ్యక్తి వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు.. అతడి కూతురు స్థానిక కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.. సోమవారం ఉదయం ఎప్పటిలాగానే కూతురిని తండ్రి కాలేజీకి డ్రాప్ చేశాడు.. సాయంత్రం ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదు.. ఎంతగా వెతికినా ఎక్కడా ఆమె (College Girl) ఆచూకీ దొరకలేదు.. తల్లిదండ్రులు టెన్షన్ పడుతుండగా.. అప్పుడు వారికి ఓ ఫోన్ వచ్చింది.. అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పింది విని ఆ యువతి తండ్రి షాకయ్యాడు.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తాడు (Crime News).
బీహార్ (Bihar) రాజధాని పాట్నా (Patna)కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి కూతురి కిడ్నాప్ (Kidnap) స్థానికంగా సంచలనంగా మారింది. పాట్నాలోని కంకర్‌బాగ్‌లో ఉన్న కళాశాలలో ఆ యువతి చదువుకుంటోంది. ఆ యువతి ఇల్లు ఫుల్వారిషరీఫ్ ప్రాంతంలో ఉంది. సోమవారం ఉదయం ఆ యువతిని ఆమె తండ్రి కాలేజీకి తీసుకెళ్లాడు. సాయంత్రం ఆ యువతి తిరిగి రాలేదు. ఎంతగా వెతికినా ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ యువతి తండ్రికి ఓ ఫోన్ వచ్చింది. ``నీకు నీ కూతురు అంటే ఇష్టం ఉంటే రూ.5 లక్షలు తీసుకుని రా`` అని కిడ్నాపర్లు బెదిరించారు.
Viral Video: అమ్మాయి కాదండీ.. అచ్చంగా అబ్బాయే.. మోకాళ్ల వరకు జుట్టుతో ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న 15 ఏళ్ల కుర్రాడు..!
షాకైన యువతి తండ్రి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్ లోకేషన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం కూడా ఉందని అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ కిడ్నాప్ కేసును ఛేదిస్తామని పోలీసులు నమ్మకంగా చెబుతున్నారు.