Kerala temple: దేశంలోనే మొట్టమొదటి సారి దేవాలయంలో పూజల కోసం యాంత్రిక ఏనుగు
ABN , First Publish Date - 2023-02-27T12:08:34+05:30 IST
దేశంలోనే మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించేందుకు యాంత్రిక ఏనుగును...
త్రిస్సూర్ (కేరళ): దేశంలోనే మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించేందుకు యాంత్రిక ఏనుగును ఏర్పాటు చేశారు.(Kerala temple)కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో యాంత్రికమైన ఏనుగును పూజల కోసం వినియోగిస్తున్నారు.(Introduces mechanical elephant)సినీనటి పార్వతి తిరువోతు మద్దతుతో పెటా ఇండియా యాంత్రిక ఏనుగును ఆలయానికి బహుమతిగా ఇచ్చింది.15 ఏళ్ల కాలంలో కేరళలో బందీ అయిన ఏనుగులు 526 మందిని చంపాయి. యాంత్రిక ఏనుగుకు ఇరింజడపిల్లి రామన్ అని పేరు పెట్టారు. పదిన్నర అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉన్న ఈ యాంత్రిక ఏనుగు నలుగురిని తీసుకెళ్లగలదు. ఏనుగు తల, కళ్లు, నోరు, చెవులు, తోక అన్నీ విద్యుత్తుతో పనిచేస్తాయి.
హిందూ ఆచారాల ప్రకారం ఉత్సవాల్లో ఏనుగులు, ఇతర జంతువులను ఉపయోగించకూడదని దేవస్థానం ఇచ్చిన పిలుపుతో పెటా ఇండియా రోబోటిక్ ఏనుగును దేవాలయానికి బహుమతిగా అందించింది. బందిఖానాలో ఉన్న ఏనుగులు విసుగు చెంది తరచూ ప్రజలపై విరుచుకుపడుతున్నాయి.
ఇది కూడా చదవండి : Agnipath Scheme: అగ్నిపథ్ స్కీం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ సంకలనం చేసిన గణాంకాల ప్రకారం 15 సంవత్సరాల కాలంలో కేరళలో బందీ అయిన ఏనుగులు 526 మందిని చంపాయి. ఉత్సవాల్లో ఏనుగులు 13మందిని చంపాయి.నిజమైన ఏనుగుల స్థానంలో యాంత్రిక ఏనుగులను ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు అభ్యర్థించారు.ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయం అధికారులు ఇతర దేవాలయాల్లో కూడా ఆచారాలు నిర్వహించడానికి సజీవ ఏనుగుల స్థానంలో యాంత్రిక ఏనుగులు ఉంచాలని సూచించారు.