బర్త్ డే పార్టీలో ఊపిరి ఆడని స్థితిలో 5ఏళ్ళ బాలుడు.. అసలు విషయం తెలుసుకుంటే..
ABN , First Publish Date - 2023-01-09T13:12:57+05:30 IST
అందరూ హడావిడిలో ఉండగా ఎవ్వరూ ఊహించని విధంగా..
పిల్లలకు పుట్టినరోజు పార్టీలు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే పుట్టినరోజు పార్టీకి రమ్మని పిలవగానే అయిదేళ్ళ పిల్లాడు తల్లిదండ్రులతో కలసి వెళ్ళాడు. అందరూ హడావిడిలో ఉండగా ఆ పిల్లాడు ఒక్కసారిగా ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతూ గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. పార్టీలో ఉన్న అందరినీ కలవరపెట్టిన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
లక్నో నగరం, ఇందిరా నగర్ లో నివసిస్తున్న పార్థసారది అనే వ్యక్తికి 5ఏళ్ళ కొడుకున్నాడు. ఆ బాబు పేరు అమ్రపాల్ మౌర్య. తెలిసిన వాళ్ళు పుట్టినరోజు పార్టీకి పిలవడంతో బాబుతో కలసి వెళ్ళారు వాళ్ళు. పార్టీలో బర్త్ డే కేక్ ను ఉంచే బాక్స్ మూతకు అయస్కాంతం ఉంటుంది. ఆ పిల్లాడు తినే కేక్ తో అది ఎలా జతకలిసిందో తెలియదు కానీ పిల్లాడు కేక్ తో పాటు అయస్కాంతాన్ని మింగేసాడు. ఆ తరువాత ఊపిరి ఆడటం లేదని గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. పిల్లాడికి ఏమయ్యిందోనని అందరూ కంగారు పడ్డారు. ఏమి తిన్నావని ఆ బాబును అడగ్గా కేకుతో పాటు అక్కడ మిగిలిన అయస్కాంతంను చూపించాడు. అది చూసి వెంటనే పిల్లాడిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. పిల్లాడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తెలియని అమాయకత్వంతో చేసిన పని పిల్లాడి ప్రాణాల మీదకొచ్చిందని ఈ సంఘటన గురించి తెలిసిన అందరూ అంటున్నారు.