Indian Railway: ఏం టాలెంట్ సామీ.. స్పీడుగా వెళ్తున్న రైలులోకి.. బ్రిడ్జ్ పై నుంచే ఎలా ఎక్కేశాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-12-06T13:05:15+05:30 IST
కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించే వీడియోలు చాలా చూసే ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం హైలెట్. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సంఘటన చూసి ఉండరు.
రైలు ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరికీ వాటి టైమింగ్ గురించి బాగానే అర్థమై ఉంటుంది. అవి రావాల్సిన టైం కి రావు, ఒక్కోసారి ముందుగానే వెళ్లి హ్యాండ్ ఇస్తాయి. ఈ కారణంగా ప్రయాణికులు రైలు ప్రయాణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ట్రైన్ బయల్దేరే టైముకు అరగంట ముందే రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. సోషల్ మీడియాలో కదులుతున్న ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించిన వ్యక్తులకు సంబంధించిన పలు వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ప్రమాదం బారిన పడుతుంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు. ఇంతకుముందెన్నడూ ఇలాంటి వీడియా చూసి ఉండరు. ఏకంగా బ్రిడ్జ్ మీద నుండే ట్రైన్ లోకి ఓ వ్యక్తి ఎలా ఎక్కేశాడో చూస్తే షాకవుతారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
సినిమాలలో హీరోలు, విలన్ లు ట్రైన్ మీద ఎక్కి రన్నింగ్ చేస్తుంటే వావ్ అనిపిస్తుంది. అవన్నీ స్టంట్ మాస్టర్ ల నేతృత్యంలో చాలా పకడ్భందీగా ప్లాన్ చేస్తారు. కానీ రియల్ గా అయితే వేగంగా వెళుతున్న ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి భయపడేవాళ్లు ఉంటారు. అయితే వీడియోలో వ్యక్తి మాత్రం ఈ భయాలకు మినహాయింపు. వీడియోలో వేగంగా వెళుతున్న రైలును చూడవచ్చు. అది బ్రిడ్జ్ కింద నుండి వెళుతోంది. బ్రిడ్జ్ పై కప్పు నుండి తెల్ల చొక్కా, ఆకుపచ్చ లుంగీ, తల మీద ఎర్రని టవల్ చుట్టుకున్న ఓ వ్యక్తి కిందకు వేలాడుతూ కనిపిస్తాడు. అతను రైలు పైన ల్యాండ్ అయి కొద్దిసేపు రైలు వేగానికి తగ్గట్టు తనూ పరిగెడతాడు. ఆ తరువాత ట్రైన్ మీద బ్యాలెన్స్ దొరికాక వెనుదిరిగి ముందుకు సాగుతాడు. ఈ విధంగా అతను ట్రైన్ ఎక్కుతాడు. అతని సాహసాన్ని మెచ్చుకోవాలో.. అతనలా చేసినందుకు మండిపడాలో తెలియక గందరగోళంలో ఉన్నారు చాలామంది.
ఇది కూడా చదవండి: ఎండు ద్రాక్షలను అసలెందుకు తినాలో చెప్పే 10 కారణాలు..!
ఈ వీడియోను Arehoo_offical అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు ఆ వ్యక్తి మీద మండిపడుతున్నారు. 'ట్రైన్ మీద అతని రన్నింగ్ ట్రెడ్ మిల్ మీద వాకింగ్ చేస్తున్నట్టు ఉంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'ట్రైన్ మిస్ అయిపోతుందని మరీ ఇంత రిస్క్ చేయాలా? ఏమైనా తేడా జరిగితే అతని ప్రాణాలే పోతాయ్' అని మరొకరు కామెంట్ చేశారు. 'రైల్వే పోలీసులు నిద్రపోతున్నారా? మొదట అతని మీద చర్యలు తీసుకోవాలి' అని ఇంకొకరు అన్నారు.