Baby Buffalo vs Elephant: ఏనుగుపై లేగదూడ అటాక్.. కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి గేదె.. చివరకు..!

ABN , First Publish Date - 2023-08-09T20:01:35+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల సంఖ్యలో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో ఆశ్చర్యకరమైనవి, నవ్వు తెప్పించేవి సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అటవీ జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు నెట్టింట బాగా హల్చల్ చేస్తున్నాయి.

Baby Buffalo vs Elephant: ఏనుగుపై లేగదూడ అటాక్.. కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి గేదె.. చివరకు..!

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల సంఖ్యలో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో ఆశ్చర్యకరమైనవి, నవ్వు తెప్పించేవి సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అటవీ జంతువులకు (Wild Animals) సంబంధించిన ఆసక్తికర వీడియోలు నెట్టింట బాగా హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ గేదె పిల్లతో ఏనుగు ప్రవర్తించిన తీరు అందరినీ మెప్పిస్తోంది.

Share Bear అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో ఒక గేదె పిల్ల (Baby Buffalo) భారీ ఏనుగు (Elephant)పై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. మూర్ఖంగా ప్రవర్తిస్తున్న బిడ్డను ఆపేందుకు తల్లి గేదె (Buffalo) ప్రయత్నిస్తోంది. అయితే తనపై దాడి చేయడానికి వస్తున్న పిల్ల గేదె అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న ఏనుగు దాని తప్పించుకోవడానికి వెనక్కి వెనక్కి వెళుతోంది. ఆ చిన్న గేదెపై ప్రతిదాడి చేయకుండా జాలి ప్రదర్శించింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది (Elephant Videos).

Viral: హనీమూన్‌కు వచ్చిన భర్తకు షాక్.. హోటల్ రూమ్ నుంచి భార్య పరారీ.. ఆమె వెళ్లిపోవడానికి కారణమేంటో తెలిస్తే..

ఈ వీడియోలో ఏనుగు హుందాగా ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆగస్టు 5న రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 34 లక్షల మంది వీక్షించగా, నాలుగున్నర వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఏనుగు ఎందుకు గొప్పదో మరోసారి రుజువైంది`` అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-08-09T20:01:35+05:30 IST