Share News

Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ అబ్బాయి కోసం అన్నీ వదిలేసి వచ్చింది.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-21T18:30:36+05:30 IST

ఆ అమ్మాయికి చాలా రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ఆ పరిచయం స్నేహంగా మారింది.. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది..

Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ అబ్బాయి కోసం అన్నీ వదిలేసి వచ్చింది.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

ఆ అమ్మాయికి చాలా రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ఆ పరిచయం స్నేహంగా మారింది.. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా (Instagram Love) మారింది.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.. చివరకు పెళ్లి (Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది.. అత్తింట్లో కొన్ని రోజులు బాగానే ఉంది.. ఆ తర్వాత అసలు రంగు బయటపడింది.. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు.. చివరకు ఆ యువతి పోలీసుల చుట్టూ తిరుగుతోంది (Crime News).

ముంబై (Mumbai)కి చెందిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ హరూన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం క్రమంగా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆ యువతి తన వాళ్లందరినీ వదిలేసి హరూన్‌ను పెళ్లి చేసుకుని అతడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు అందరూ ఆమెను బాగానే చూశారు. నెల రోజుల క్రితం ఉన్నట్టుండి హరూన్ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

Police: అర్ధరాత్రి పోలీసుల చెకింగ్.. కారులో డబ్బుతో పట్టుబడిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. వారం రోజుల తర్వాత అత్తమమాలు ఆ యువతిని కొట్టి, ఇంటి నుంచి గెంటేశారు. రూ. 5 లక్షలు కట్నంగా తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తామని చెప్పారు. దీంతో ఆ యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదు తీసుకున్న పోలీసుల నుంచి స్పందన మాత్రం కరువైంది. దీంతో ఆమె జిల్లా ఎస్పీని, మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-10-21T18:30:36+05:30 IST