Shocking News: 17 ఏళ్ల క్రితమే అన్నం తినడం మానేశాడు.. కేవలం కూల్ డ్రింక్స్ తాగుతూ బతుకుతున్నాడు..!

ABN , First Publish Date - 2023-05-19T14:01:29+05:30 IST

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. సమయానికి భోజనం, నిద్ర రెండు తప్పనిసరి.

Shocking News: 17 ఏళ్ల క్రితమే అన్నం తినడం మానేశాడు.. కేవలం కూల్ డ్రింక్స్ తాగుతూ బతుకుతున్నాడు..!

ఇంటర్నెట్ డెస్క్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. సమయానికి భోజనం, నిద్ర రెండు తప్పనిసరి. ఈ రెండింటిలో ఏది కరెక్టుగా లేకున్న కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. శీతల పానీయాలైతే (Cold Drinks) యమ డేంజర్ అనే చెప్పాలి. వాటి వల్ల ఊబకాయం, శరీరంలో చక్కెర శాతం పెరుగుతాయి. అందుకే వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అయితే, ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తి (Iran Man) మాత్రం దీనికి పూర్తి భిన్నంగా గడిచిన 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ మాత్రమే తాగి బతుకుతున్నాడు. అయినా అతడికి ఎలాంటి అనారోగ్యం లేకవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అతడి పేరు ఘోలమ్రేజా అర్దేషిరి (Gholamreza Ardeshiri). గత 17ఏళ్ల నుంచి తన నోట్లో కనీసం ఒక్క ధాన్యం గింజ కూడా వేయలేదని చెబుతున్నాడాయన. అతడు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు రోజంతా పెప్సీ, సెవెన్ అప్ మాత్రమే తీసుకుంటానని అంటున్నాడు. అయినా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నాడు. అతను చివరిసారిగా 2006లో ఆహారం తీసుకున్నాడట. ఆ తర్వాత ఇప్పటివరకు నోట్లో ఏ ఘన ఆహార పదార్థాన్ని పెట్టింది లేదు. అంతేందుకు అతడికి ఆహారం మీద ప్రత్యేక ఆసక్తి కూడా లేదట. దాంతో కూల్ డ్రింక్స్‌కు అలవాటు పడ్డానని చెబుతున్నాడాయన. ఇక ఘోలమ్రేజా తన వింత పరిస్థితి గురించి మాట్లాడుతూ.. తన పొట్ట శీతల పానీయాలను మాత్రమే జీర్ణం చేస్తుందన్నాడు. కాదని తాను వేరే ఏదైనా తినడానికి ప్రయత్నిస్తే అంతే సంగతులు. అలా తిన్న వెంటనే వాంతులు వచ్చేస్తాయని తెలిపాడు. శీతల పానీయాలు తీసుకున్నప్పుడు మాత్రం తన పొట్టకు కంఫర్ట్‌గా ఉంటుందని, తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చాడు. కాగా, వృత్తిరీత్యా అతడు ఫైబర్‌గ్లాస్ రిపేర్ చేసే పని చేస్తుంటాడు.

Viral Video: ఈ బుడ్డోడికి అసలు భయమే లేదా..? అంతటి గాలి దుమ్ములోనూ ఈ పిల్లాడు చేస్తున్న పనేంటో చూసి నెటిజన్లు ఫిదా..!


వైద్యులకు కూడా అతడి ఈ వింత వ్యాధి గురించి అంతుచిక్కలేదు..!

ఇక ఘోలమ్రేజా అర్దేషిరి చెప్పిన దాని ప్రకారం.. అతడు 17 ఏళ్ల కింద అందరిలానే మొదట ఘన ఆహార పదార్థాలనే తీసుకునేవాడట. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకు ఉన్నట్టుండి కొంచెం ఆహారం తిన్నా.. వెంటనే వాంతులు కావడం మొదలైంది. అంతేగాక తన నోటిలో వెంట్రుకలు పోయినట్లు అనిపించేదట. పొట్ట నుంచి గొంతు దాకా లోపల జుట్టు పెరుగుతున్నట్టుగా అతడి ఫీలింగ్. దాంతో అతడు వైద్యుల వద్దకు వెళ్లాడు. కానీ, ఫలితం లేకపోయింది. అతడిని పరీక్షించిన వైద్యులకు ఎలాంటి అనారోగ్య సమస్య కనిపించలేదు. ఆహారం తిన్నప్పుడల్లా నోటిలో వెంట్రుకలు వస్తాయని భావించడం వల్ల ఆహారం జీర్ణం కావడం లేదనేది వైద్యులు చెబుతున్నమాట. ఇలా చాలామంది వైద్యులనే కలిశాడు. కానీ, ఏ ఒక్కరికి కూడా అతడి ఈ వింత వ్యాధి గురించి అంతుచిక్కలేదు. ఇక అతడికి శీతల పానీయాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతో గత పదిహేడేళ్లుగా శీతల పానీయం తాగి బతికేస్తున్నాడు.

Viral Video: భర్త, పిల్లలకు భోజనం పెట్టేందుకు ఓ భార్య వింత కండీషన్.. ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి రూల్‌ను పాటిస్తే..!

Updated Date - 2023-05-19T14:01:29+05:30 IST