పగటి నిద్ర హానికరమా? లాభదాయకమా?... ఏళ్ల తరబడి కొనసాగుతున్న పరిశోధనలు... తాజా అధ్యయనాల్లో ఆశ్చర్యకర విషయాలు వెల్లడి!
ABN , First Publish Date - 2023-05-02T08:40:45+05:30 IST
పగటి నిద్ర హానికరమని(Harmful) కొందరు, లాభదాయకమని మరికొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది నిజం? తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పగటి నిద్ర హానికరమని(Harmful) కొందరు, లాభదాయకమని మరికొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది నిజం? తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పగటి నిద్ర ఫలితాలు(Daytime sleep results) అందరి విషయంలోనూ ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రా సమయం, నిద్రా స్థానం, ఇతర అంశాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
పగటి నిద్ర కారణంగా ఊబకాయం(obesity) వచ్చే ప్రమాదం ఉందని మునుపటి అధ్యయన ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి స్పెయిన్(Spain)లో పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం అనేది ప్రజల జీవితాల్లో సాంస్కృతికంగా ముడిపడి ఉన్న అంశం.
అటువంటి పరిస్థితిలో పగటినిద్ర వ్యవధి అనేది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారు. వీరి పరిశోధన(Research)లో పగటిపూట నిద్రపోని వారి కంటే.. రోజుకు నిర్ణీత సమయానికి మించి 30 నిమిషాల కంటే అధిక సమయం నిద్రపోయే వారిలో ఊబకాయం, అధిక రక్తపోటు(blood pressure), గుండె సంబంధిత రుగ్మతలు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
అయితే పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం అనేది రాత్రి ఆలస్యంగా నిద్రించేందుకు దారితీస్తుంది. అలాగే ఆహారం తీసుకునే సమయంపై ప్రభావం చూపుతుంది. అయితే పగటి పూట స్వల్ప సమయం నిద్రపోయే వారు అంటే పవర్ ఎన్ఎపిని తీసుకునే వారిలో ఊబకాయం, జీవక్రియ(Metabolism) మార్పుల ముప్పు అంతగా కనిపించదు. అలాగే పగటి పూట కాసేపు నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాల్లో(studies) తేలింది.
కాసేపు పగటి పూట విశ్రాంతి తీసుకోవడం అనేది మనిషి పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. ఇది మంచి ఆరోగ్యానికి అవసరమని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. భవిష్యత్ అధ్యయనాల్లో(future studies) కూడా ఇదే స్పష్టమైతే పగటి నిద్ర ప్రాముఖత గురించి ప్రచారం జరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.