బంగారం పేరుతో ఎర వేశాడు.. గుడ్డిగా నమ్మిన అమ్మాయి హోటల్‌కు వెళితే అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2023-03-12T18:49:04+05:30 IST

ఆ యువతి ఓ వివాహం కోసం తన వదిన ఇంటికి వెళ్లింది.. నగలు కొనేందుకని ఆ యువతి తన వదినతో కలిసి నగల దుకాణానికి వెళ్లింది.. నగల దుకాణం యజమాని వారికి బంగారు నగలు చూపించాడు..

బంగారం పేరుతో ఎర వేశాడు.. గుడ్డిగా నమ్మిన అమ్మాయి హోటల్‌కు వెళితే అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత..

ఆ యువతి ఓ వివాహం కోసం తన వదిన ఇంటికి వెళ్లింది.. నగలు కొనేందుకని ఆ యువతి తన వదినతో కలిసి నగల దుకాణానికి వెళ్లింది.. నగల దుకాణం యజమాని వారికి బంగారు నగలు చూపించాడు.. ఇంకా వెరైటీలు వస్తాయని చెప్పి ఆ యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి మంచి డిజైన్లు వచ్చాయని, హోటల్‌కు వస్తే వాటిని చూపిస్తానని చెప్పాడు.. అతడి మాటలు నమ్మి అమాయకంగా వెళ్లిన యువతికి భయంకర అనుభవం ఎదురైంది (Crime News).

హర్యానాలోని (Haryana) కైతాల్‌కు నగల వ్యాపారి ఓ యువతిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి జలంధర్ నుంచి తన వదిన ఇంటికి ఓ పెళ్లి కోసం వెళ్లింది. ఈ క్రమంలో నగలు చూసేందుకు నగల దుకాణానికి వెళ్లింది. వారికి అక్కడ ఉన్న డిజైన్లు నచ్చలేదు. దీంతో రెండ్రోజుల్లో మంచి డిజైన్లు వస్తాయని చెప్పి నగల దుకాణం యజమాని సాహిల్ ఆ యువతి మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఈ నెల 2వ తేదీన ఫోన్ చేసి డిజైన్లు వచ్చాయని చెప్పాడు. భోజనం చేద్దామని చెప్పి ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. భోజనం అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు (Sexual Harassment).

``మీ నాన్న నా అప్పు తీర్చనవసరం లేదు.. నేను చెప్పినట్టు చెయ్యి``.. ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి చేసిన పనికి..

హోటల్ నుంచి వచ్చిన యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. అనంతరం అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడు సాహిల్‌పై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

భార్య కోసం భర్త అగచాట్లు.. పుట్టింట్లోనే ఉండిపోతున్న భార్య కోసం వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం..

Updated Date - 2023-03-12T18:49:04+05:30 IST