Job Notification: వీళ్లకు కావాల్సింది ఉద్యోగులు కాదు.. బానిసలు అంటూ నెటిజన్ల ఆగ్రహం.. ఆ కంపెనీ జాబ్ ప్రకటన చూసి..!
ABN , First Publish Date - 2023-09-20T11:52:09+05:30 IST
ఏ జాబ్ నోటిఫికేషన్ చూసినా నిరుద్యోగుల కళ్లు మెరుస్తాయి. కానీ ఇది చూస్తే మాత్రం ఎక్కడలేని కోపం వస్తోంది. దీని వెనుక కారణం ఏంటంటే..
ఎక్కడ ఏ చిన్న ఉద్యోగ ప్రకటన చూసినా నిరుద్యోగులు ఎగబడుతుంటారు. నిర్ణీత సమయానికి పని చేసి నెలవారీ వేతనం తీసుకోవడం పట్ల చాలామంది మొగ్గు చూపుతారు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఒక బుక్ స్టోర్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఉద్యోగ ప్రకటన చూసిన నెటిజన్లు 'వారికి కావలసింది ఉద్యోగలు కాదు బానిసలు' అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలో సదరు బుక్ స్టోర్ పేర్కొన్న అంశాలే నెటిజన్ల ఆగ్రహానికి కారణం. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఈ పోటీ ప్రపంచంలో ప్రత్యేకంగా ప్రయత్నిస్తే తప్ప ఏ రంగంలోనూ అంత సులువుగా నిలబడలేరు. అలాంటి ప్రయత్నం చేసింది కుంజుమ్(Kunzum). బుక్ స్టోర్, కాఫీ కేప్(Kunzum book store and coffee cafe) రెండూ కలగలిపి దీన్ని రూపొందించారు. దేశంలో 5స్టోర్ లలో 2022లో వీటిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ(Delhi) ఎన్ఆర్సి లో పనిచేయడానికి గానూ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, జర్నలిస్ట్, ఈవెంట్స్ మేనేజర్, సేల్స్ మొదలైన ఐదు విభాగాలలో పనిచేయడానికి గానూ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది(Job hiring). అయితే ప్రకటనలో వారు ప్రస్తావించిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఫుల్ టైం పనిచేయాలని పేర్కొన్నారు. వారంలో 7రోజులు, రోజులో 24గంటలు వర్క్ చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. పైపెచ్చు ఉద్యోగస్తులకు ఎలాంటి సెలవులు, వీకాఫ్స్ లాంటివి ఉండవని పేర్కొంది. 'కస్టమర్లను చిరునవ్వుతో పలకరించాలి, తెలియని వారితో మాట్లాడే సమయంలో తగినంత సామాజిక అవగాహన కలిగి ఉండాలి. వర్క్ ఫ్రమ్ హామ్ పూర్తీగా నిషిద్దం' అంటూ ఇందులో విషయాలు పొందుపరిచారు.
Viral Video: వామ్మో.. ఇదేం పనయ్యా నాయనా..? చిన్న పిల్లాడిని బైక్‌పై వెనుకయినా కూర్చోబెట్టుకోకుండా ఇంత రిస్కేంటి..?
ఈ ఉద్యోగ ప్రకటనను Kunzum స్వయానా తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్లో షేర్ చేసింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు పైర్ అవుతున్నారు. ఈ ప్రకటన గురించి పంచ్ లు, సెటైర్లు వేస్తున్నారు. 'వాళ్లకు కావాల్సింది బానిసలు తప్ప ఉద్యోగస్తులు కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'లక్షలు ఇచ్చినా సరే ఇలాంటి ఉద్యోగం ఎవరూ చెయ్యరు' అని మరొకరు కామెంట్ చేశారు. 'భారత కార్మిక చట్టాలను కుంజుమ్ బుక్ స్టోర్ ఉల్లంఘిస్తోంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. Zomoto ప్రోడక్ట్ మేనేజర్ ఆశిష్ సింగ్ ఈ ఉద్యోగ ప్రకటన చూసి స్పందించారు. 'కుంజుమ్ దాస్ ను నియమిస్తున్నాడు' అని కామెంట్ చేశారు. ఇది చూసి ఆయన పొగిడారా, విమర్శించారా అంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.