Viral Video: ఎక్కడి నుంచి వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు.. బాటిల్ మూతతో తలుపులకు తాళాన్నే తయారు చేశాడుగా..!
ABN , First Publish Date - 2023-09-23T15:57:33+05:30 IST
ఆలోచించే శక్తి ఉండాలి కానీ, ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం దొరుకుతుంది. కష్టసాధ్యమైన సమస్యకు చాలా సులువైన పరిష్కారాలు కనుగొన్న ఎన్నో వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కారును హెలీకాఫ్టర్‌గా మార్చాడు.
ఆలోచించే శక్తి ఉండాలి కానీ, ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారం దొరుకుతుంది. కష్టసాధ్యమైన సమస్యకు చాలా సులువైన పరిష్కారాలు కనుగొన్న ఎన్నో వీడియోలు (Jugaad videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కారును హెలీకాఫ్టర్‌గా మార్చాడు. మరొక వ్యక్తి స్కూటర్‌ను పిండిమిల్లుగా మార్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బాటిల్ మూత (Bottle Cap as Lock)ను ఇంటికి తాళంగా అమర్చారు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
viralwarganet అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బాటిల్ క్యాప్ (Bottle Cap)తో ఓ వ్యక్తి డోర్ లాక్ (Door Lock)ని ఎలా తయారు చేశాడో కనిపిస్తోంది. బాటిల్ పై భాగాన్ని రెండుగా కట్ చేసి గడియలా మార్చాడు. బాటిల్ క్యాప్‌ను దానికి తాళంలా వేశాడు. ఇలాంటి తాళం వల్ల భారీ ఉపయోగం ఉండకపోవచ్చు కానీ, చూసే వారికి తలుపు వేసినట్టు కనిపిస్తోంది. జంతువులు, పక్షులు ఇంటి లోపలికి రాకుండా ఈ క్యాప్ లాక్ బాగా పని చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల మంది వీక్షించారు. కొన్ని లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. క్యాప్ లాక్ ఆలోచన వచ్చిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ``అందరి దగ్గర ఖరీదైన తాళాలు కొనే డబ్బు ఉండదు``, ``సౌకర్యాలు లేనపుడు ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.