Kalatapasvi Viswanath: 'శంకరాభరణం' ఉదయం ఆటకి నలుగురే వచ్చారు

ABN , First Publish Date - 2023-02-03T12:37:07+05:30 IST

కాశీనాథుని విశ్వనాధ్ లేక కళాతపస్వి విశ్వనాధ్ #RIPVishwanathGaru తెలుగు సినిమాని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహా మనీషి. ఎందుకంటే తెలుగులో సినిమాలు తీస్తారని విదేశీయులకి కూడా తెలిసేటట్టు చెయ్యగలిగే చిత్రం 'శంకరాభరణం' (Shankarabharanam).

Kalatapasvi Viswanath: 'శంకరాభరణం' ఉదయం ఆటకి నలుగురే వచ్చారు

కాశీనాథుని విశ్వనాధ్ లేక కళాతపస్వి విశ్వనాధ్ #RIPVishwanathGaru తెలుగు సినిమాని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహా మనీషి. ఎందుకంటే తెలుగులో సినిమాలు తీస్తారని విదేశీయులకి కూడా తెలిసేటట్టు చెయ్యగలిగే చిత్రం 'శంకరాభరణం' (Shankarabharanam). తెలుగు సినిమాని ఎప్పుడూ 'శంకరాభరణం' కి ముందు తరువాత అని అంటారు. ఎందుకంటే ఆ సినిమా అంతటి ప్రభావాన్ని చూపించింది. మామూలుగా సినిమాలు సమాజం మీద కానీ, మనుషుల మీద కానీ ఎటువంటి ప్రభావం చూపించదు అని అంటే అది చాలా తప్పు. విశ్వనాధ్ #RIPVishwanathGaru గారు సినిమాలు వచ్చాక, సంగీతం, నృత్య, నాట్య కళాశాలలు ఎన్నో వెలిశాయి. అలాగే ఎందరో అతని సినిమాలతో స్ఫూర్తి, ప్రేరణ పొంది ఎన్నో విధాలా సమాజానికి దోహద పడ్డారు కూడా.

kv2.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విదేశాల్లో వున్న తెలుగు వారు 'శంకరాభరణం' #RIPVishwanathGaru సినిమా అప్పట్లో క్యాసెట్లు గా వచ్చేవి అవే వుంచుకునేవారు. ఇప్పటికీ విశ్వనాధ్ #RIPVishwanathGaru గారి సినిమాలు విదేశాల్లో ప్రతి తెలుగు వారి ఇంట్లో ఉంటాయి. 'శంకరాభరణం' విజయం సాధించిన తరువాత, విశ్వనాధ్ #RipLegend గారు తరువాత సినిమాలు అన్నీ సంగీతం, సాహిత్యం, నాట్యం, సంప్రదాయాల నేపథ్యంలో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న అని విశ్వనాధ్ గారే స్వయంగా చెప్పారు.

అయితే ఈ 'శంకరాభరణం' సినిమా వెనకాల కూడా ఒక కథ వుంది. ఆ సినిమా అయిపోయాక విడుదల చెయ్యడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కూడా ముందుకు రాలేదట. కమల్ హాసన్ బ్రదర్ చారు హాసన్ కూడా సినిమా చూసి ఇది చాల బాగుంది కానీ ఇందులో కమెర్షియల్ విలువలు లేవు సినిమా నడవదు అని చెప్పేశాడట. చివరికి లక్ష్మి ఫిలిమ్స్ ద్వారా సినిమా విడుదల చేశారు అని చెప్పుకొచ్చారు విశ్వనాధ్ (K Viswanath) గారు.

kv3.jpg

సినిమా విడుదల అయిన రోజున విశ్వనాధ్ #RIPVishwanathGaru గారు సికింద్రాబాద్ లోని రోయల్ థియేటర్ (Royal Theater) లో తన సినిమా చూసుకుందుకు ఉదయం ఆటకు వెళ్లారట. బాల్కనీ లోంచి కిందకి చూస్తే నలుగురంటే నలుగురే వున్నారట ప్రేక్షకులు. ఇంకేముంది సినిమా నడవదు, ఇంక సాయంకాలానికి చేదు వార్త వినాల్సి వస్తుంది అని ప్రిపేర్ అయి ఎదురు చూస్తున్నారట. అప్పట్లో సినిమా పోతే దాన్ని 'క్లాసిక్' అని సెటైరికల్ గా అనేవారట. ఉదయం ఆట అప్పుడు అలానే విన్నారుట విశ్వనాధ్ గారు. కానీ సాయంకాలానికి ఆ నోటా ఈ నోటా పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ అయి, మొదటి ఆట హౌస్ ఫుల్ అయిందట. ఆ తరువాత ఆ సినిమా ఎంత చరిత్ర సృష్టించిందో మనకి తెలిసిందే.

ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. అంత పెద్ద ప్రభావం చూపించింది. విశ్వనాధ్ గారు ఆ సినిమా నుండి తెలుగు సినిమా అనేది ఒకటుంది అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తరువాత 'సాగర సంగమం' (Sagara Sangamam) కమల్ హాసన్ (Kamal Haasan) ని పెద్ద స్టార్ ని చేసింది. విశ్వనాధ్ సినిమాలకి అవార్డులు రాకపోతే ఆశ్చర్యపోయేవారు, అంటే అయన సినిమాల్లో ఎన్నో విలువలతో కూడిన అంశాలు ఉండేవి. తెలుగు సినిమా గతిని మార్చిన 'శంకరాభరణం' విడుదల అయిన రోజునే అయన పోవటం #RIPVishwanathGaru నిజంగా అది యాదృచ్చికం అయినా, అది అద్భుతం అనే చెప్పాలి!

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-02-03T12:46:28+05:30 IST