Home » Kamal Haasan
లెజెండరీ యాక్టర్, కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.
సినిమా అనే స్కూల్‌కు హీరోయిన్ త్రిష(Heroine Trisha)తోనే కాదు ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళతానని అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) సరదాగా వ్యాఖ్యానించారు.
రెండు దశాబ్దాలకు ముందే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తానెంతో ఉన్నత స్థితిలో ఉండేవాడినని, ఆ సమయంలో వెనుకంజ వేయటమే తన మొదటి ఓటమి అని మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్(Film actor Kamal Haasan) అన్నారు.
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటి అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
Kamal Haasan: మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్.. గతేడాాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బరిలో నిలుద్దామని ఆశించారు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఇక 2019 నాటి లోక్ సభ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.
భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు తెలుసుకుని పాటించాలని అగ్రహీరో, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 75 యేళ్ళ క్రితం ఇదే రోజు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రూపొందిందన్నారు.
‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం దేశానికే ముప్పు కలిగిస్తుందని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్ పేర్కొన్నారు.
మక్కల్‌నీది మయ్యం నాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథోపరిజ్ఞానం) కోర్సు చేయడానికి ఈ నెలాఖరున అమెరికా వెళ్తున్నారు. రెండు నెలలపాటు ఆయన ఆ కోర్సు అధ్యయనం చేయనున్నారు. అదే సమయంలో అమెరికా నుంచే ఆయన పార్టీ వ్యవహారాలు నడపాలని కూడా నిర్ణయించారు.
తమిళనాట తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్ భరోసా ఇచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు.
దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan) అన్నారు.