Kangana Ranaut - mother: 8 గంటలు పొలం పని... ఎందుకంటే!
ABN , First Publish Date - 2023-02-27T23:47:41+05:30 IST
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. తన సినిమా ప్రమోషన్ అయినా, వ్యక్తిగత విషయాలైనా, ఎవరినైనా నిలదీయాలన్నా ముక్కుసూటిగా సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతుంటారామె!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (kangana ranaut) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. తన సినిమా ప్రమోషన్ అయినా, వ్యక్తిగత విషయాలైనా, ఎవరినైనా నిలదీయాలన్నా ముక్కుసూటిగా సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతుంటారామె! తాజాగా కంగనా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తన తల్లి ఆశా రనౌత్ (aasha ranaut) గురించి. ‘‘అమ్మా రోజులో సుమారు 8 గంటలు పొలంలో పని చేస్తుంటారు. ముంబైలో ఉండడం, విదేశాలు చుట్టేయడం, షూటింగ్ సెట్‌కి వెళ్లడం, బయట తినడం ఆమెకు నచ్చదు. వీటిలో ఏదైనా ఒకటైనా చేద్దాం అమ్మా అంటే నోటికొచ్చినట్లు తిడుతుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా స్వయంగా తానే స్నాక్స్, టీ అందిస్తుంది. మా ఇంటికి చాలామంది బంధుమిత్రలు వస్తుంటారు. వారందరినీ అమ్మ బాగా చూసుకుంటుంది. వారందరికీ నువ్వే ఇవ్వడం ఎందుకు? అన్ని సిద్ధం చేసి పెడతావ్ అని ఓసారి అడిగాను. ‘మనల్ని ప్రేమించే వారికి సేవ చేయడం మన అదృష్టం’ అని చెప్పింది’’ అని కంగన తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన తల్లి పొలం పని చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. ( Kangana Ranaut about her mother)
అదే ఫొటోను రీట్వీట్ చేస్తూ ‘‘కంగనా రనౌత్ మిలియనీర్, మంచి స్థాయిలో ఉన్నారు అయినా కూడా ఆమె తల్లి పొలంలో పని చేస్తున్నారు. ఇంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది?’’ అని ఓ నెటిజన్ సందేహం వ్యక్తం చేశారు. దానిపై కంగన స్పందించారు. (Kangana Fire on netizen)‘‘ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మా అమ్మ నా వల్ల ధనికురాలు కాదు. నేను పలువురు రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, ప్రభుత్వ అధికారులు ఉన్న కుటుంబం నుంచి వచ్చా. అమ్మ 25 ఏళ్లకుపైగా టీచర్‌గా పని చేసింది. కష్టపడే తత్వం మాకు ఆమె నుంచే అలవరింది. సినిమా మాఫియాపె నా వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. అందుకే కొందరు నటుల్లాగా పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయను. ఒకరి దగ్గరికి వెళ్లి చేయి చాచను. ఇతర హీరోయిన్లలా సిగ్గుపడను’’ అని కంగన అన్నారు. కెరీర్ బిగినింగ్‌లో తాను ఎదుర్కొన్నచేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరో ట్వీట్ చేశారు కంగనా.