Kanniyakumari: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్ళిన సముద్రం

ABN , First Publish Date - 2023-09-16T10:00:49+05:30 IST

సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారి(Kanniyakumari)లో ఓ వైపు సముద్రం వెనక్కి మళ్ళింది. మరో వైపు రాక్షస అలలు తీరం

Kanniyakumari: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్ళిన సముద్రం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారి(Kanniyakumari)లో ఓ వైపు సముద్రం వెనక్కి మళ్ళింది. మరో వైపు రాక్షస అలలు తీరం వైపు దూసుకువచ్చాయి. ఈ పరిస్థితి కారణంగా వివేకానంద స్మారక మండపం ప్రాంతానికి పూంపుహార్‌ సంస్థ బోట్‌ సఫారీని తాత్కాలికంగా రద్దు చేసింది. ఉదయం 8 గంటలకు వివేకానంద స్మారక మండపం తీరంలో సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో బోట్‌సఫారీని ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు రద్దు చేశారు. ఆ తర్వాత సముద్రతీరం యథాస్థితికి వచ్చింది. అదే సమయంలో త్రివేణి సంగమ ప్రాంతం వద్ద అరేబియా సముద్రతీరంలో, హిందూ మహాసముద్రం తీరంలోనూ రాక్షస అలలు ఎగసిపడ్డాయి. చిన్నముట్టం, వావ్‌తురై, కోవళం, కీల్‌మణక్కుడి, మణక్కుడి తదితర సముద్రతీర గ్రామాల వద్ద 10 నుండి 15 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. దీంతో త్రివేణి సంగమ ప్రాంతంలో పర్యాటకులను స్నానం చేయడానికి అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు.

nani5.jpg

Updated Date - 2023-09-16T10:05:56+05:30 IST