Viral Video: పెళ్లి వేదికపై వరుడితో యాంకర్ అసభ్య ప్రవర్తన.. పక్కనే కూర్చున్న వధువు రియాక్షన్ చూడండి..
ABN , First Publish Date - 2023-08-29T09:44:53+05:30 IST
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా మధుర ఘట్టం. వీలైనంత ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమ తాహతుకు తగ్గట్టు డబ్బులు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా కూడా పెడుతుంటారు. అలా ఓ ఫిమేల్ సింగర్ హల్‌చల్ చేసిన ఓ పెళ్లి వేడుక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పెళ్లి (Marriage) అనేది ఎవరి జీవితంలోనైనా మధుర ఘట్టం. వీలైనంత ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమ తాహతుకు తగ్గట్టు డబ్బులు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు ప్రత్యేకంగా సింగర్లతో ఆర్కెస్ట్రా కూడా పెడుతుంటారు. అలా ఓ ఫిమేల్ సింగర్ (Lady singer)ను ఏర్పాటు చేసిన ఓ పెళ్లి వేడుక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వేదికపై వధువు పక్కన కూర్చున్న వరుడి (Groom)తో ఆ మహిళా సింగర్ అసభ్యంగా ప్రవర్తించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
chutiyapa_begins అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు రిసెప్షన్ వేదికపై కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఓ మహిళా గాయని పాట పాడుతూ వేదిక ఎక్కింది. పాట పాడుతూ వేదిక ఎక్కి డ్యాన్స్ చేసింది. అంతేకాదు వేదికపై జిమ్నాస్టిక్స్ చేసింది. అనంతరం వరుడి వద్దకు వెళ్లి కాస్త రొమాంటిక్‌గా తాకుతూ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత వరుడిని పైకి లేపి అతడి పైకి ఎక్కేసింది (Lady Singer clings to groom). ఈ ఘటనతో వధువు (Bride) సిగ్గుపడింది.
Shocking: నా భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్యే.. అసలు నేరస్తురాలని తెలిసి అంతా షాక్.. ఏంటీ పని అని నిలదీస్తే..!
మహిళా యాంకర్ అలా ప్రవర్తించినా వధువు కోపగించుకోకుండా పూలగుత్తి అడ్డు పెట్టుకుని నవ్వుకుంది. అనంతరం ఆ పూలగుత్తితో వరుడిని సరదాగా కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 9 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.