railway track tragedy: ఆ రైల్వే ట్రాక్ నిర్మాణంలో లక్షకు పైగా మరణాలు... చరిత్రను కుదిపేసిన అత్యంత విషాద ఘటన అది!

ABN , First Publish Date - 2023-03-21T07:33:19+05:30 IST

railway track tragedy: రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగేటప్పుడు సంభవించే దుర్ఘటనల్లో(accidents) కొందరు కూలీలు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఆ దేశంలో రైల్వే ట్రాక్ నిర్మాణ సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో లక్ష మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారంటే ఎవరూ నమ్మలేరు.

railway track tragedy: ఆ రైల్వే ట్రాక్ నిర్మాణంలో లక్షకు పైగా మరణాలు... చరిత్రను కుదిపేసిన అత్యంత విషాద ఘటన అది!

railway track tragedy: రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగేటప్పుడు సంభవించే దుర్ఘటనల్లో(accidents) కొందరు కూలీలు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఆ దేశంలో రైల్వే ట్రాక్ నిర్మాణ సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో లక్ష మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారంటే ఎవరూ నమ్మలేరు. రెండవ ప్రపంచ యుద్ధం(Second World War) జరుగుతున్న సమయంలో థాయ్‌లాండ్ బర్మాస్ రంగూన్‌లను కలుపుతూ రైలు మార్గాన్ని నిర్మించారు.

ఇది బర్మా రైల్వే లైన్‌గా ప్రభుత్వ పత్రాల్లో నమోదయ్యింది. 415 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గాన్ని నిర్మించే సమయంలో సుమారు 1,20,000 మంది ప్రాణాలు కోల్పోయారని చరిత్ర(history) చెబుతోంది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఈ రైలు మార్గాన్ని ఇప్పుడు డెత్ రైల్వే అని కూడా పిలుస్తారు. ఈ రైలు మార్గాన్ని(Railway line) నిర్మించడానికి, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా, బర్మా, మలేషియా, సింగపూర్‌(Singapore)తో సహా అనేక ఆసియా దేశాల నుండి 1,80,000 మందికి పైగా జనాలకు తీసుకువచ్చారు.

దీనికితోడు ఈ రైలు మార్గం నిర్మాణంలో వివిధ దేశాలకు చెందిన 60,000 మందికి పైగా ఖైదీలు(Prisoners) పనిచేశారు. వీరిని జపాన్ సైన్యం పర్యవేక్షించింది. జపాన్ సైన్యం చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఈ రైలు మార్గాన్ని నిర్మించిందని చెబుతారు. ఈ రైలు మార్గం నిర్మాణపని 15 నెలల(15 months) పాటు కొనసాగిందని, ఈ సమయంలో కలరా, మలేరియా(Malaria), ఆకలి కారణంగా సుమారు 90,000 మంది కూలీలు మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ రైల్వే నిర్మాణ సమయంలో జరిగిన వైమానిక బాంబు దాడులు(Aerial bombing), కాల్పులకు వేలమంది బలయ్యారు.

Updated Date - 2023-03-21T10:18:18+05:30 IST